అసలు నేను రావాలా? వొద్దా?-Namasthe Telangana

[ad_1]

అమితాబ్‌కు అభిమానుల నుంచి తీపి హెచ్చరికలు జారీ అయ్యాయి. దానికి కారణం ఏంటనుకుంటున్నారా? మన ఇండియా టీమ్‌ వరల్డ్‌కప్‌లో అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. బుధవారం జరిగిన సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ని మట్టి కరిపించి ఫైనల్‌కు చేరింది భారత్‌ జట్టు.


అసలు నేను రావాలా? వొద్దా?

అమితాబ్‌కు అభిమానుల నుంచి తీపి హెచ్చరికలు జారీ అయ్యాయి. దానికి కారణం ఏంటనుకుంటున్నారా? మన ఇండియా టీమ్‌ వరల్డ్‌కప్‌లో అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. బుధవారం జరిగిన సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ని మట్టి కరిపించి ఫైనల్‌కు చేరింది భారత్‌ జట్టు. ఈ నెల 19న ఆస్ట్రేలియాతో ఫైనల్‌లో తలపడనుంది మన భారత్‌. ఈ మ్యాచ్‌ గురించి అమితాబ్‌ ప్రస్తావిస్తూ.. ‘నేను మ్యాచ్‌ చూడకపోతే ఇండియా కచ్చితంగా గెలుస్తుంది..’ అంటూ తన ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్ట్‌ చేశారు. అంతే ఆయనకు స్వీట్‌ వార్నింగ్‌లు మొదలయ్యాయి.

ఒక నెటిజన్‌ ‘మీరు ఫైనల్‌ మ్యాచ్‌కు రావొద్దు..’ అని పోస్ట్‌ పెట్టాడు. మరొకతను ‘మీరు ఇంట్లో టీవీలో కూడా మ్యాచ్‌ చూడొద్దు’ అంటూ అభ్యర్థించాడు. ఇంకో అభిమాని ‘అసలు ఆ రోజు మీరు ఇంట్లోనుంచి బయటకు రాకుండా ఉండేందుకు, మీ ఇంటి గేట్‌కి తాళం వేయటానికి మేం సన్నాహాలు చేస్తున్నాం’ అంటూ పోస్ట్‌ పెట్టాడు. ఇవన్నీ చూశాక ‘అసలు నేను మ్యాచ్‌కి రావాలా? వొద్దా? అని నిజంగానే ఆలోచిస్తున్నా’ అంటూ సరదాగా మరో పోస్ట్‌ పెట్టారు బిగ్‌బీ. దేశం విషయానికొచ్చేసరికి అంతపెద్ద సూపర్‌స్టార్‌కి కూడా సొంత అభిమానుల నుంచే వార్నింగులు తప్పలేదు.

Next article

[ad_2]

Leave a Comment