‘కల్కీ’ సినిమాలో ప్రభాస్ హీరో.. కమల్‌హాసన్ విలన్. సినిమాల్లో హీరో చేతిలో విలన్ దెబ్బలు తినడం సర్వసాధారణం. మరి కమల్‌ని ప్రభాస్ కొడతాడా? నిజంగా తెరపై అది జరిగితే సగటు ప్రేక్షకుడు ఆ సన్నివేశాన్ని తీసుకోగలుగుతాడా? పైగా కమల్‌హాసన్ దేశవ్యాప్తంగా అభిమానులున్న సూపర్‌స్టార్.

‘కల్కీ’ సినిమాలో ప్రభాస్ హీరో.. కమల్‌హాసన్ విలన్. సినిమాల్లో హీరో చేతిలో విలన్ దెబ్బలు తినడం సర్వసాధారణం. మరి కమల్‌ని ప్రభాస్ కొడతాడా? నిజంగా తెరపై అది జరిగితే సగటు ప్రేక్షకుడు ఆ సన్నివేశాన్ని తీసుకోగలుగుతాడా? పైగా కమల్‌హాసన్ దేశవ్యాప్తంగా అభిమానులున్న సూపర్‌స్టార్. కొన్నేళ్ల విరామానంతరం ఆయన ‘విక్రమ్’తో హిట్ కొడితే అది నాలుగు వందల కోట్లు వసూలు చేసింది.
అది కమల్ కెపాసిటీ. నేటికీ హీరోగా ఆయన ఇమేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. ఆ మాటకొస్తే ప్రభాస్ కూడా కమల్‌హాసన్ అభిమానే. ఆ విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పాడు కూడా. అలాంటప్పుడు ఈ కథలో విలన్‌ని హీరో ఎలా ఎదుర్కొంటాడు? దర్శకుడు నాగ్‌అశ్విన్ వీరిద్దరి మధ్య సన్నివేశాలు ఎలా డిజైన్ చేశాడు? ఇది దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను వెంటాడుతున్న ప్రశ్న. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనప్పటికీ, కమల్ పాత్ర చిత్రణ ఎలా ఉంటుందనే విషయం మాత్రం చూచాయగా తెలుస్తున్నది.
ఇందులో కమల్‌ది అత్యంత శక్తిమంతుడైన క్రూరుడి పాత్ర అని తెలుస్తున్నది. మరి ఈ పాత్రకు దర్శకుడు నాగ్‌అశ్విన్ ఎలాంటి ముగింపునిస్తాడో అనేది తెరపైనే చూడాలి. ఏదిఏమైనా ‘కల్కీ’ సినిమా మాత్రం అంచనాలకు అందే సినిమా కాదని ఫిలిం వర్గాల సమాచారం.