spot_img
Monday, December 4, 2023
HomeEntertainmentఈ సినిమాను మీరు ఒంటరిగా కూర్చొని చూడలేరు!-Namasthe Telangana

ఈ సినిమాను మీరు ఒంటరిగా కూర్చొని చూడలేరు!-Namasthe Telangana

-


శ్రీరామ్‌, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్‌ ఫిల్మ్‌’ అనేది ఉపశీర్షిక. సాయికిరణ్‌ దైదా దర్శకుడు. యశ్వంత్‌ దగ్గుమాటి నిర్మాత. డిసెంబర్‌ 15న విడుదల కానున్న ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకుంది.


Pindam | ఈ సినిమాను మీరు ఒంటరిగా కూర్చొని చూడలేరు!

Pindam | శ్రీరామ్‌, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్‌ ఫిల్మ్‌’ అనేది ఉపశీర్షిక. సాయికిరణ్‌ దైదా దర్శకుడు. యశ్వంత్‌ దగ్గుమాటి నిర్మాత. డిసెంబర్‌ 15న విడుదల కానున్న ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘సెన్సార్‌ సభ్యులు ఈ సినిమా చూసి ఎంతో అభినందించారు. డిసెంబర్‌ 7న ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించనున్నాం.

మా యూనిట్‌ సభ్యులతోపాటు పలువురు చిత్రరంగ ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొంటారు. డిసెంబర్‌ 15న ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. ఇది పూర్తిస్థాయి హారర్‌ సినిమా. టాలీవుడ్‌లో ఇప్పటివరకూ చూడని హారర్‌ ఈ సినిమాలో చూస్తారు. ఒంటరిగా కూర్చొని ఈ సినిమా చూడలేరు. కథ, కథనం ఈ చిత్రానికి ప్రధాన బలం’ అని తెలిపారు. ఈశ్వరీరావు, అవసరాల శ్రీనివాస్‌, రవివర్మ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: సతీశ్‌ మనోహర్‌, సంగీతం: కృష్ణసౌరభ్‌ సూరంపల్లి.

Related articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
3,912FollowersFollow
0SubscribersSubscribe
spot_img

Latest posts