Rajinikanth | ఒకరు ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న లెజెండరీ స్టార్ హీరో.. మరొకరు బాలీవుడ్ క్వీన్‌గా లీడింగ్ పొజిషన్‌లో కొనసాగుతున్న స్టార్ హీరోయిన్. ఈ ఇద్దరు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఎలా ఉంటుంది. సరిగ్గా అలాంటి దృశ్యమే చోటుచేసుకుంది. ఇంతకీ ఆ ఇద్దరెవరనే కదా మీ డౌటు.

Rajinikanth | ఒకరు ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న లెజెండరీ స్టార్ హీరో.. మరొకరు బాలీవుడ్ క్వీన్‌గా లీడింగ్ పొజిషన్‌లో కొనసాగుతున్న స్టార్ హీరోయిన్. ఈ ఇద్దరు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఎలా ఉంటుంది. సరిగ్గా అలాంటి దృశ్యమే చోటుచేసుకుంది. ఇంతకీ ఆ ఇద్దరెవరనే కదా మీ డౌటు. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) .. మరొకరు కంగనారనౌత్ (Kangana Ranaut). ప్రస్తుతం రజినీకాంత్ టీజే జ్ఞానవేల్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న తలైవా 170 షూటింగ్‌తో బిజీగా ఉన్నాడని తెలిసిందే.
అయితే తలైవా కంగనారనౌత్ సినిమా సెట్స్‌కు వెళ్లి సర్‌ప్రైజ్ ఇచ్చాడు రజినీకాంత్. సైకలాజికల్ థ్రిల్లర్‌గా వస్తోన్న కంగనారనౌత్- మాధవన్ చిత్రం షూటింగ్ చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈవెంట్‌కు తలైవా హాజరై కంగనారనౌత్ పుష్ప గుచ్చం అందించి బీటౌన్ క్వీన్ టీంకు శుభాకాంక్షలు తెలియజేశాడు. గాడ్ ఆఫ్ ఇండియన్ సినిమాగా భావించే రజినీకాంత్ సర్‌ప్రైజ్ ఎంట్రీతో ఆశ్చర్యపోవడం కంగనా వంతైంది. ఇప్పుడీ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తలైవి డైరెక్టర్ ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.
ఈ చిత్రాన్ని ట్రైడెంట్ ఫిలిమ్స్-అహింస ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలపై రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది. తను వెడ్స్ మను, తను వెడ్స్ మను రిటర్న్స్ సినిమాల తర్వాత 8 ఏండ్లకు కంగనారనౌత్-మాధవన్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
On our first day of the shoot God of Indian cinema Thalaivar himself thrilled us with a surprise visit on our set.
What a lovely day!! Missing Maddy @ActorMadhavan as he joins us soon ❤️ @Tridentartsoffc @rajinikanth @sanjayragh pic.twitter.com/DNE87M9Uru— Kangana Ranaut (@KanganaTeam) November 18, 2023