తగ్గేదే.. హాట్ టాపిక్‌గా త్రిష డెసిషన్‌.. !-Namasthe Telangana

[ad_1]

Trisha | మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌ పొన్నియన్ సెల్వన్‌ ప్రాంఛైజీతో మంచి సక్సెస్‌ అందుకున్న త్రిష (Trisha) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీయెస్ట్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇదిలా ఉంటే త్రిషకు సంబంధించిన న్యూస్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.


Trisha | తగ్గేదే.. హాట్ టాపిక్‌గా త్రిష డెసిషన్‌.. !

Trisha | ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలుగా సక్సెస్‌ఫుల్‌ కెరీర్‌ను కొనసాగిస్తూ.. ఇప్పటికీ వన్ ఆఫ్‌ ది లీడింగ్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్న అతికొద్ది మంది హీరోయిన్లలో టాప్‌లో ఉంటుంది త్రిష (Trisha). మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌ పొన్నియన్ సెల్వన్‌ ప్రాంఛైజీతో మంచి సక్సెస్‌ అందుకున్న త్రిష ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీయెస్ట్ హీరోయిన్‌గా మారిపోయింది. సీనియర్‌ హీరోలందరికీ మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా మారిపోయిందంటే త్రిష క్రేజ్‌ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే త్రిషకు సంబంధించిన న్యూస్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

కొందరు తెలుగు నిర్మాతలు ఓ సీనియర్ హీరో సినిమాలో ఫీ మేల్ లీడ్ రోల్‌ కోసం త్రిషను సంప్రదించగా.. ఈ బ్యూటీ మాత్రం భారీ మొత్తంలో రెమ్యునరేషన్‌ (Remuneration) అడిగిందని జోరుగా చర్చ నడుస్తోంది. త్రిష సదరు నిర్మాతలను రూ.4 కోట్లు రెమ్యునరేషన్‌ అడిగిందని లేటెస్ట్‌ టాక్‌. ఆమె చెప్పినంత ఇచ్చుకోలేమని భావించిన నిర్మాతలు ఇక చేసేదేమి లేక ప్రత్యామ్నాయ మార్గాలపై ఫోకస్ పెట్టారని టాక్‌ వినిపిస్తోంది. త్రిషకు ఇది కొత్తేమీ కాదు. గతంలో కూడా ఇద్దరు అగ్రహీరోల సినిమాలను రెమ్యునరేషన్‌ విషయంలోనే పక్కకు పెట్టేసిందన్న టాక్ కూడా ఉంది.

మొత్తానికి నాలుగు పదుల వయస్సులోనూ కుర్రహీరోయిన్లకు గట్టి పోటీనిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. త్రిష ప్రస్తుతం మణిరత్నం కమల్ హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‌KH234 కీలక హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీలో త్రిషను నయా అవతార్‌లో చూపించబోతున్నట్టు కోలీవుడ్ సర్కిల్ టాక్‌. అజిత్ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న Vidaa Muyarchiతోపాటు మోహన్ లాల్ నటిస్తోన్న రామ్‌ పార్ట్‌ 1 త్రిష ఖాతాలో ఉన్నాయి.

 

Actress @khushsundar about #SouthQueen @trishtrashers 🤗😍 #Trisha #Vikatan pic.twitter.com/0uFlSMmPUM

— Arun Kumar 🗡 (@aruntrish) August 4, 2023

Next article[ad_2]

Leave a Comment