నోటి దురుసు వీపుకు చేటు అనేది పెద్దల నానుడి. అందుకే మాట్లాడేటప్పుడు నోటిని అదుపులో పెట్టుకోవాలి. తమిళ విలన్ మన్సూర్ అలీఖాన్ ఇలాగే నోటికి పనిచెప్పి అనవసరపు వివాదానికి తెరలేపాడు.

నోటి దురుసు వీపుకు చేటు అనేది పెద్దల నానుడి. అందుకే మాట్లాడేటప్పుడు నోటిని అదుపులో పెట్టుకోవాలి. తమిళ విలన్ మన్సూర్ అలీఖాన్ ఇలాగే నోటికి పనిచెప్పి అనవసరపు వివాదానికి తెరలేపాడు. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో కథానాయిక త్రిష గురించి అభ్యంతరకరమైన కామెంట్లు చేసి అందరికీ టార్గెట్ అయ్యాడు.
‘నేను చాలా సినిమాల్లో రేప్ సీన్స్‌లో నటించా. ‘లియో’ ఆఫర్ వచ్చినప్పుడు త్రిషతో కూడా ఇలాంటి సీన్ చేసే అవకాశం ఉంటుందేమో అనుకున్నా. కానీ అందులో అలాంటి సీన్ లేదు. చాలా బాధ పడ్డాను’ అంటూ ఓ ఇంటర్వ్యూలో కామెంట్ చేశాడు మన్సూర్ అలీఖాన్. కాగా, ఈ వ్యాఖ్యలపై త్రిష చాలా సీరియస్‌గా స్పందించింది. ‘ అతను మాట్లాడిన వీడియా నేను చూశాను. అలాంటి నీచమైన వ్యక్తితో తెరను పంచుకోనందుకు చాలా ఆనందంగా ఉంది. ఇకపై కూడా నటించకుండా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటా. ఇలాంటివాళ్లు మన జాతికే సిగ్గుచేటు’ అంటూ ఆవేశంగా మాట్లాడింది త్రిష.
ఈ విషయంలో తమిళనాడు వ్యాప్తంగా త్రిషకు గట్టిగానే మద్దతు లభిస్తున్నది. దర్శకుడు లోకేశ్ కనగరాజ్, నటి మాళవికా మోహనన్, గాయని చిన్మయి తదితరులు మన్సూర్ అలీఖాన్ ప్రవర్తనను తప్పుపడుతూ త్రిషకు మద్దతు పలికారు. పరిస్థితులు చేజారడంతో మన్సూర్ ఈ విషయంపై మళ్లీ స్పందిస్తూ.. ‘త్రిష అంటే నాకు చాలా గౌరవం.. నేనేదో సరదాగా అన్నాను. ఆ మాటలు ఇంత వివాదానికి దారి తీస్తాయనుకోలేదు’ అంటూ క్షమాపణ కోరాడు. మాట పెదవి దాటితే తిరిగి తీసుకోలేం. ఈ విషయం ఇప్పటికైనా మన్సూర్ అలీఖాన్ గ్రహిస్తే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు.