నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ రవీంద్ర(బాబీ) కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రానికి సంబంధించి అద్భుతమైన అప్‌డేట్ ఒకటి రీసెంట్‌గా వెలుగుచూసింది. ఈ సినిమా మల్టీస్టారర్‌గా రూపొందనుందనేది తాజా సమాచారం.

నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ రవీంద్ర(బాబీ) కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రానికి సంబంధించి అద్భుతమైన అప్‌డేట్ ఒకటి రీసెంట్‌గా వెలుగుచూసింది. ఈ సినిమా మల్టీస్టారర్‌గా రూపొందనుందనేది తాజా సమాచారం. మల్టీస్టారర్ సినిమాలు తీయడంలో బాబీ సిద్ధహస్తుడు. ఆయన తీసిన ‘వెంకీమామ’ మల్టీసార్టర్. అందులో వెంకటేశ్, నాగచైతన్య కలిసి నటించారు. బాబీ రీసెంట్ హిట్ ‘వాల్తేరువీరయ్య’ కూడా మల్టీస్టారర్. అందులో చిరంజీవి, రవితేజ కలిసి నటించారు.
ప్రస్తుతం చేస్తున్న బాలయ్య సినిమా కూడా మల్టీస్టారర్ అనేది అత్యంత విశ్వసనీయ సమాచారం. దుల్కర్‌సల్మాన్ ఇందులో కీలక పాత్ర పోషించనున్నాడని తెలిసింది. 1980 ప్రాంతంలో జరిగే కథ ఇదని, ఇందులో దుల్కర్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని, బాలకృష్ణ పాత్ర అత్యంత శక్తిమంతంగా ఉంటుందని తెలుస్తున్నది. ఇదిలావుంటే.. ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
బాబీ సినిమా అంటే దేవిశ్రీప్రసాద్ కామన్. కానీ బాలయ్యకు గత మూడు విజయాలకూ తమనే సంగీత దర్శకుడు. మరి బాలయ్య సెంటిమెంట్ ప్రకారం తమన్‌ని తీసుకుంటారా? లేక బాబీ సెంటిమెంట్‌ని గౌరవిస్తూ దేవిశ్రీనే ఫైనల్ చేస్తారా? అనేది తెలియాల్సివుంది. అనిరుధ్ కోసం కూడా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. బాలయ్య నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం.