ప్రస్తుతం ప్రభాస్ సినిమా అంటే వందల కోట్ల మాటే. మార్కెట్ ఆ రేంజ్‌లో ఉన్నప్పుడు ఏ హీరో అయినా నిర్ణయాల విషయంలో సమయం తీసుకుంటాడు. కానీ ప్రభాస్ మాత్రం జెట్ స్పీడ్‌లో డెసిషన్స్ తీసుకుంటూ విరామం లేకుండా సినిమాలు చేస్తున్నాడు.

ప్రస్తుతం ప్రభాస్ సినిమా అంటే వందల కోట్ల మాటే. మార్కెట్ ఆ రేంజ్‌లో ఉన్నప్పుడు ఏ హీరో అయినా నిర్ణయాల విషయంలో సమయం తీసుకుంటాడు. కానీ ప్రభాస్ మాత్రం జెట్ స్పీడ్‌లో డెసిషన్స్ తీసుకుంటూ విరామం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ‘సలార్’ డిసెంబర్లో రానుంది. ఆ తర్వాత ‘ప్రాజెక్ట్ కె’, దాని తర్వాత మారుతి ‘రాజా డీలక్స్’.. ఇవి చాలవన్నట్టు ఇప్పుడు మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు విశ్వసనీయ సమాచారం.
‘సీతారామం’తో భారీ బ్లాక్‌బస్టర్‌ని తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నట్టు తెలిసింది. 300కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందనుందని, రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ఈ సినిమా కథ, కథనాలు సాగుతాయని తాజా సమాచారం. ప్రభాస్ ఇమేజ్‌కి తగ్గట్టుగా, ప్రపంచవ్యాప్త ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా ఈ పాన్ ఇండియా మూవీని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ప్రసిద్ధ బాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి యూవీ క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు వినికిడి.