శివకార్తికేయన్‌ సినిమాలో మోహన్‌లాల్‌.. క్రేజీ టాక్‌లో నిజమెంత..?-Namasthe Telangana

[ad_1]

Sivakarthikeyan | తెలుగు, తమిళంలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఉన్న హీరో శివకార్తికేయన్‌ (Sivakarthikeyan). తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్ ఒకటి ఇండస్ట్రీ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది. ఈ చిత్రంలో కీ రోల్‌ కోసం మలయాళం సూపర్ స్టార్ మోహన్‌లాల్‌ (Mohanlal)ను సంప్రదించగా.. మోహన్‌ లాల్ కూడా గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చాడని టాక్‌ నడుస్తోంది.


Sivakarthikeyan | శివకార్తికేయన్‌ సినిమాలో మోహన్‌లాల్‌.. క్రేజీ టాక్‌లో నిజమెంత..?

Sivakarthikeyan | తెలుగు, తమిళంలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఉన్న హీరో శివకార్తికేయన్‌ (Sivakarthikeyan). ఈ టాలెంటెడ్ యాక్టర్ చివరగా మావీరన్‌ సినిమాతో ప్రేక్షకులను పలుకరించాడు. ప్రస్తుతం ఎస్‌కే21 ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్న శివకార్తికేయన్ ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో సినిమాను ప్రకటించాడని తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్ ఒకటి ఇండస్ట్రీ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది. ఈ చిత్రంలో కీ రోల్‌ కోసం మలయాళం సూపర్ స్టార్ మోహన్‌లాల్‌ (Mohanlal)ను సంప్రదించగా.. మోహన్‌ లాల్ కూడా గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చాడని టాక్‌ నడుస్తోంది.

అంతేకాదు బాలీవుడ్ యాక్టర్ విద్యుత్ జమ్వాల్‌ కూడా ఈ టీంతో జాయిన్ కాబోతున్నట్టు మరో న్యూస్ కూడా హల్ చల్ చేస్తోంది. SK 23గా వస్తున్న ఈ మూవీలో మృణాళ్‌ ఠాకూర్‌ ఫీ మేల్ లీడ్ రోల్‌లో మెరువనుందట. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. శ్రీలక్ష్మి మూవీస్‌ బ్యానర్‌పై వస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులపై వివరాలపై మేకర్స్‌ నుంచి అధికారిక ప్రకటన వస్తే.. క్లారిటీ రానుంది.

మోహన్‌ లాల్ ప్రస్తుతం వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉన్నాడు. మలైకొట్టై వాలిబన్‌, Barroz, Empuraan, వృషభ, రామ్‌ పార్ట్‌ 1, rambaan సినిమాల్లో నటిస్తున్నాడు. ఇంత బిజీ షెడ్యూల్‌లో శివకార్తికేయన్ సినిమాకు కాల్షీట్లు ఇచ్చాడా..? లేదా అనేదానిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. SK21ను రాజ్‌కుమార్‌ పెరియసామి (Rajkumar Periasamy) దర్శకత్వం వహిస్తున్నాడు. సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీలో విశ్వరూపం ఫేం రాహుల్ బోస్‌ (RahulBose) విలన్‌గా నటిస్తున్నాడు.

సాయిపల్లవి కశ్మీర్‌ లొకేషన్‌లో దిగిన ఫొటోలు నెటిజన్లను మనసు దోచేస్తున్నాయి. కథానుగుణంగా కశ్మీర్‌లో 75 రోజులపాటు SK21 లాంగ్ షెడ్యూల్‌ పూర్తి చేశారని తెలిసిందే.

 

శివకార్తికేయన్‌ న్యూ లుక్‌..

Sk22

Sk22

Next article[ad_2]

Leave a Comment