spot_img
Thursday, December 7, 2023
HomeEntertainmentAadikeshava Movie | ‘ఆదికేశవ’ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్ క్యాన్సిల్.. కారణం ఇదే.!-Namasthe Telangana

Aadikeshava Movie | ‘ఆదికేశవ’ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్ క్యాన్సిల్.. కారణం ఇదే.!-Namasthe Telangana

-


Aadikeshava | టాలీవుడ్ మెగా హీరో పంజా వైష్ణవ్‌ తేజ్‌ (Vaishnav Tej) నటిస్తోన్న తాజా చిత్రం ‘ఆదికేశవ’ (Aadikeshava). శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండ‌గా.. శ్రీకాంత్ ఎన్‌ రెడ్డి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ప‌క్కా మాస్ ఎంట‌ర్‌టైన‌ర‌గా వ‌స్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన టైటిల్, ఫస్ట్‌ గ్లింప్స్ వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి.


Aadikeshava Movie | ‘ఆదికేశవ’ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్ క్యాన్సిల్.. కారణం ఇదే.!

Aadikeshava | టాలీవుడ్ మెగా హీరో పంజా వైష్ణవ్‌ తేజ్‌ (Vaishnav Tej) నటిస్తోన్న తాజా చిత్రం ‘ఆదికేశవ’ (Aadikeshava). శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండ‌గా.. శ్రీకాంత్ ఎన్‌ రెడ్డి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ప‌క్కా మాస్ ఎంట‌ర్‌టైన‌ర‌గా వ‌స్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన టైటిల్, ఫస్ట్‌ గ్లింప్స్ వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను నేడు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌ (AMB Cinemas)లో ఈ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించనున్నట్లు మేక‌ర్స్ తెలిపారు. అయితే ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌ ఈరోజు లేద‌ని చిత్ర‌బృందం సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించి అంద‌రికి షాక్ ఇచ్చింది.

ఈ విష‌యాన్ని తెలుపుతూ… ”సాంకేతిక సమస్యల‌ కారణంగా మా ‘ఆదికేశవ’ (Aadikeshava) ట్రైలర్ విడుదలను వాయిదా వేయవలసి వచ్చింది. ఈ చివరి నిమిషంలో ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌ను రద్దు చేసినందుకు.. అలాగే మీకు కలిగించిన అసౌకర్యానికి మా మీడియా మిత్రులకు, అభిమానులందరికీ మేము క్షమాపణలు కోరుతున్నాము అంటూ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సోష‌ల్ మీడియాలో రాసుకోచ్చింది.

ఇక ఈ సినిమాను సితార ఎంట‌ర్‌టైన్ మెంట్స్ (Sithara Entertainments)-ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యాన‌ర్లపై నాగ‌వంశి, సాయి సౌజ‌న్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బీస్ట్‌ ఫేం అపర్ణా దాస్, జోజు జార్జ్ త‌దిత‌రులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Next article



Related articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
3,912FollowersFollow
0SubscribersSubscribe
spot_img

Latest posts