Amitabh Bachchan | బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటాడన్న విషయం తెలిసిందే. ఏ విషయంలోనైన తనదైన శైలిలో స్పందించి అందరిని ఆకట్టుకుంటాడు. అయితే ఇలా సరదాగా చేసిన ఒక పోస్ట్ అమితాబ్‌కు ప్రస్తుతం చిక్కులు తెచ్చిపెట్టింది.

Amitabh Bachchan | బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటాడన్న విషయం తెలిసిందే. ఏ విషయంలోనైన తనదైన శైలిలో స్పందించి అందరిని ఆకట్టుకుంటాడు. అయితే ఇలా సరదాగా చేసిన ఒక పోస్ట్ అమితాబ్‌కు ప్రస్తుతం చిక్కులు తెచ్చిపెట్టింది. వరల్డ్ కప్ సెమీస్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఇక నవంబర్ 19న జరుగనున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా – ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి.
అయితే సెమీస్‌లో న్యూజిలాండ్‌పై భారత్ గెలిచిన అనంతరం అమితాబ్ బచ్చన్ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ‘నేను మ్యాచ్ చూడకపోతే.. ఇండియా కచ్చితంగా గెలుస్తుంది’ అని పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్ పెట్టిన కాసేపటికే తెగ వైరల్ అయ్యింది. ఇక ఈ పోస్ట్‌పై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ.. ‘అమితాబ్ సార్ ఫైనల్ మ్యాచ్‌కు మీరు రావొద్దు అలా చేస్తేనే ఇండియా గెలుస్తుంది’ అని పెట్టాడు. మరో నెటిజన్ రిప్లయ్ ఇస్తూ.. ”మ్యాచ్ రోజు అసలు మీరు ఇంట్లో టీవి కూడా చూడొద్దు” అని తెలిపాడు. ఇంకో యూజర్ అయితే.. ”మ్యాచ్ రోజు మీరు బయటకు రాకుండా మీ ఇంటికి తాళాలు వేసేందుకు మేము ట్రై చేస్తాం’ అని తెలిపాడు. దీంతో ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
T 4831 – when i don’t watch we WIN !
— Amitabh Bachchan (@SrBachchan) November 15, 2023
T 4832 – अब सोच रहा हूँ, जाऊँ की ना जाऊँ !
— Amitabh Bachchan (@SrBachchan) November 16, 2023
ఇక తాజాగా దీనిపై అమితాబ్ స్పందిస్తూ.. ‘ఈ కామెంట్స్ చూశాక ఇప్పుడు మ్యాచ్‌కు రావాలా.. వద్దా..? అని ఇప్పుడు నిజంగానే ఆలోచిస్తున్నా అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.