Animal Movie | బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor), అర్జున్ రెడ్డి (Arjun Reddy) ఫేమ్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Vanga) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘యానిమల్’(Animal). ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మంధాన (Rashmika Mandana) హీరోయిన్‌గా నటిస్తుంది.

Animal Movie | బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor), అర్జున్ రెడ్డి (Arjun Reddy) ఫేమ్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Vanga) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘యానిమల్’(Animal). ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మంధాన (Rashmika Mandana) హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు మ్యూజికల్ అప్‌డేట్ ఇవ్వగా సినీ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. ఇక ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. యానిమల్ విడుదల తేదీకి ఇంకా 13 రోజులే గడువు ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్ వేగం పెంచారు. ముఖ్యంగా ఈ మూవీ ట్రైలర్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి ఒక సాలిడ్ అప్‌డేట్ బయటకు వచ్చింది.
ఈ మూవీ ట్రైలర్‌ను నవంబర్ 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మరోవైపు ‘యానిమల్’ టీమ్ బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకు వస్తున్న విషయం తెలిసిందే. రణ్‍బీర్ కపూర్, రష్మిక, సందీప్ రెడ్డి వంగా పాల్గొననున్న ఈ అన్‍స్టాపబుల్ పాన్ ఇండియా ఎపిసోడ్‌ను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఆహాలో నవంబర్ 24న స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు.
#ANIMAL – Trailer – 21st November pic.twitter.com/Ks0qSTM7oP
— Aakashavaani (@TheAakashavaani) November 17, 2023