spot_img
Friday, December 1, 2023
HomeEntertainmentCWC 2023 Final | ఫైనల్‌ మ్యాచ్‌లో సల్మాన్‌ ఖాన్‌, నాని.. ట్రెండింగ్‌లో స్టిల్స్‌-Namasthe Telangana

CWC 2023 Final | ఫైనల్‌ మ్యాచ్‌లో సల్మాన్‌ ఖాన్‌, నాని.. ట్రెండింగ్‌లో స్టిల్స్‌-Namasthe Telangana

-


CWC 2023 Final | భారత్‌ – ఆసీస్‌ మధ్య అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్ (CWC 2023 Final) అట్టహాసంగా కొనసాగుతోంది. ఫైనల్ మ్యాచ్‌ను తమ ప్రమోషన్స్‌ కోసం వినియోగించుకుంటూ టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నారు స్టార్ హీరోలు.


CWC 2023 Final | ఫైనల్‌ మ్యాచ్‌లో సల్మాన్‌ ఖాన్‌, నాని.. ట్రెండింగ్‌లో స్టిల్స్‌

CWC 2023 Final | భారత్‌ – ఆసీస్‌ మధ్య అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్ (CWC 2023 Final) అట్టహాసంగా కొనసాగుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం క్రికెట్‌ లవర్స్‌, మూవీ లవర్స్‌తో నిండిపోయింది. ఫైనల్ మ్యాచ్‌ను తమ ప్రమోషన్స్‌ కోసం వినియోగించుకుంటూ టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నారు స్టార్ హీరోలు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌ (Salmankhan)నటించిన చిత్రం టైగర్‌ 3 (Tiger3).

నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ తెచ్చుకుంటూ.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న చిత్రం హాయ్‌ నాన్న (Hi Nanna). తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో శౌర్యువ్‌ (డెబ్యూ డైరెక్టర్‌) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 7న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. మృణాళ్‌ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ప్రమోషన్స్‌ షురూ చేసింది నాని టీం.

ఈ స్టార్‌ హీరోలిద్దరూ ఫైనల్ మ్యాచ్‌లో తమ తమ సినిమాలను ప్రమోట్‌ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా సల్లూభాయ్‌, ఇండియా జెర్సీలో ఉన్న నాని చిట్‌ చాట్ స్టిల్స్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. ఓ వైపు ఇండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా మరోవైపు స్టార్ హీరోల సందడి చూసేందుకు రెండు కండ్లు చాలవా అన్నట్టుగా ఉన్న స్టిల్స్‌ ఆన్‌లైన్‌లో హల్ చల్ చేస్తున్నాయి.

మనీశ్‌ శర్మ దర్శకత్వంలో సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటించిన చిత్రం టైగర్‌ 3 . కత్రినాకైఫ్‌ ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌ పోషించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సక్సెస్‌ఫుల్‌గా స్క్రీనింగ్ అవుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిల్తుస్తోంది.

ఫైనల్‌ మ్యాచ్‌లో సల్మాన్‌ ఖాన్‌, నాని..

హాయ్‌ నాన్న ప్రమోషన్స్‌..

గాజు బొమ్మ ఫుల్‌ లిరికల్‌ సాంగ్‌..

 

సమయమా సాంగ్

హాయ్‌ నాన్న టైటిల్‌  గ్లింప్స్‌..

నాని 30 గ్లింప్స్‌ వీడియో..

టైగర్‌ 3 వసూళ్లు ..

టైగర్‌ 3 అరుదైన రికార్డు..

టవల్‌ సీన్‌ మేకింగ్ స్టిల్స్‌..

#Tiger3 is coming to roar on 11th Nov, 9 PM IST onwards in Middle East, North America, UK & Europe and Africa! #YRF50 | #YRFSpyUniverse pic.twitter.com/q3XnG6NDQg

— Yash Raj Films (@yrf) November 1, 2023

టైగర్ 3 ట్రైలర్..



Related articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
3,912FollowersFollow
0SubscribersSubscribe
spot_img

Latest posts