బాలీవుడ్ దర్శకుడు, ధూమ్, ధూమ్ 2 దర్శకుడు సంజయ్ గధ్వి (Sanjay Gadhvi) గుండెపోటుతో మరణించారు. హృతిక్ రోషన్, అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ధూమ్ ఫ్రాంచైజీతో సంజయ్‌కు విశేష ప్రేక్షకాదరణ లభించింది.

ముంబై : బాలీవుడ్ దర్శకుడు, ధూమ్, ధూమ్ 2 దర్శకుడు సంజయ్ గధ్వి (Sanjay Gadhvi) గుండెపోటుతో మరణించారు. హృతిక్ రోషన్, అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ధూమ్ ఫ్రాంచైజీతో సంజయ్‌కు విశేష ప్రేక్షకాదరణ లభించింది. మరో మూడురోజుల్లో 57వ ఏట అడుగుపెట్టనుండగా ఈ విషాదం జరగడంతో ఆయన కుటుంబసభ్యులు, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
సంజయ్‌కు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆయన ఇటీవల ఫ్రెండ్స్‌తో కలిసి మల్టీప్లెక్స్‌లో సినిమాలు చూశారని చెబుతున్నారు. సంజయ్ మేరే యార్ కి షాదీ హై, కిడ్నాప్ మూవీలకూ కూడా దర్శకత్వం వహించారు. 2020లో ఆజాద్ గజబ్ లవ్, ఆపరేషన్ పరిందే మూవీలను కూడా ఆయన తెరకెక్కించారు.
సంజయ్ గధ్వి 2000లో తేరే లియే మూవీతో డైరెక్టర్‌గా కెరీర్ ఆరంభించారు. 2004లో యాక్షన్ థ్రిల్లర్ ధూమ్‌తో సంజయ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సంజయ్ మరణం పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు ట్విట్టర్ వేదికగా తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు తమ సానుభూతి తెలిపారు.
Read More :
Mukesh Ambani | మనుమల బర్త్ డే వేడుకల్లో ముకేశ్ అంబానీ దంపతులు