World Cup Final | ఐసీసీ వన్డే ప్రపంచకప్ (ICC World Cup Final) తుది సమరానికి భారత్, ఆస్ట్రేలియా జట్లు సిద్ధమైపోయాయి. ఆదివారం (నవంబర్ 19) అహ్మదాబాద్ (Ahmedabad) లోని నరేంద్ర మోదీ స్టేడియంలో (Narendra Modi Stadium) భారత్ – ఆస్ట్రేలియా (India Vs Australia) మధ్య ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

World Cup Final | ఐసీసీ వన్డే ప్రపంచకప్ (ICC World Cup Final) తుది సమరానికి భారత్, ఆస్ట్రేలియా జట్లు సిద్ధమైపోయాయి. ఆదివారం (నవంబర్ 19) అహ్మదాబాద్ ( Ahmedabad)లోని నరేంద్ర మోదీ స్టేడియంలో (Narendra Modi Stadium) భారత్ – ఆస్ట్రేలియా (India Vs Australia) మధ్య ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మ్యాచ్ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఫైనల్స్ కావడంతో క్రికెట్ అభిమానులే కాదు.. అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఈ మ్యాచ్‌కు స్వయంగా హాజరై వీక్షించే అవకాశం కనిపిస్తోంది.
ఇప్పటికే ఈ మ్యాచ్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ వస్తున్న విషయం తెలిసిందే ఇక వీరితో పాటు.. క్రికెట్ దిగ్గజాలు ఎమ్ఎస్ ధోనీ, కపిల్ దేవ్ కూడా ఈ మ్యాచ్‌కు హాజరవుతారని సమాచారం. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌కు సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ బయటకు వచ్చింది.
ఈ ఫైనల్ మ్యాచ్‌కు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌తో పాటు, సౌత్ ఇండస్ట్రీకి చెందిన సినీ దిగ్గజాలు వస్తున్నట్లు తెలిసిందే. ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, టాలీవుడ్ స్టార్ హీరోలు వెంకటేష్, నాగార్జున, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌లు వస్తున్నట్లు సమాచారం. ఇక వీరి రాకతో స్టేడియం సందడిగా మారనుంది.
మరోవైపు ఈ ఫైనల్ మ్యాచ్ అభిమానులకు కొత్త అనుభూతిని అందించబోతోంది. అహ్మదాబాద్ వేదికగా జరనున్న ప్రపంచకప్ ముంగిట భారత వాయుసేనకు చెందిన సూర్య కిరణ్ ఏరోబాటిక్ బృందం విన్యాసాలు (Air Show) చేయబోతోంది. ఈ విషయాన్ని గుజరాత్‌కు చెందిన డిఫెన్స్ పీఆర్వో గురువారం ఒక ప్రకటనలో ధృవీకరించారు. ఫైనల్ పోరు మొదలయ్యే పది నిమిషాల ముందు స్టేడియంలో ఈ విన్యాసాలు అభిమానులను అలరించనున్నాయి. మొత్తం తొమ్మిది ఎయిర్‌క్రాఫ్ట్‌లు రకరకాల ఆకారాలతో అబ్బురపరుచనున్నాయి.