Mangalavaaram Review | ఆరేళ్ల కింద ఆర్ఎక్స్ 100 సినిమాతో సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు అజయ్ భూపతి. అంచనాలు లేకుండా వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. ఈ సినిమాతోనే ఇండస్ట్రీలో కార్తికేయ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకటి రెండు కాదు ఏకంగా 15 కోట్ల వరకు లాభాలు తీసుకొచ్చింది ఆర్ఎక్స్ 100.

Mangalavaaram Review | ఆరేళ్ల కింద ఆర్ఎక్స్ 100 సినిమాతో సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు అజయ్ భూపతి. అంచనాలు లేకుండా వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. ఈ సినిమాతోనే ఇండస్ట్రీలో కార్తికేయ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకటి రెండు కాదు ఏకంగా 15 కోట్ల వరకు లాభాలు తీసుకొచ్చింది ఆర్ఎక్స్ 100. దాని తర్వాత మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ కోసం అజయ్ భూపతి వెయిట్ చేస్తూనే ఉన్నాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన మహా సముద్రం దారుణంగా డిజాస్టర్ కావడంతో.. ఈయన నుంచి దూరంగా జరిగారు హీరోలు. దాంతో రెండు సంవత్సరాలుగా కసితో రగిలిపోతున్న ఈయన మంగళవారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
తన లక్కీ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఇందులో నటించడంతో అంచనాలు కూడా బాగానే పెరిగాయి. సినిమా ఎలా ఉండబోతుందో అని ఆసక్తి అందరిలోనూ పెంచేశాడు అజయ్ భూపతి. దానికి తోడు ట్రైలర్ టీజర్ పాటలు కూడా బాగానే ఉండడంతో భారీగా రిలీజ్ అయింది మంగళవారం. అన్నింటికీ మించి సినిమాపై నమ్మకంతో ముందు రోజే పెయిడ్ ప్రీమియర్స్ వేశారు దర్శక నిర్మాతలు. దేనికి కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఆకాశంలో తేలిపోతున్నారు వాళ్ళు. ఇందులో కూడా బోల్డ్ లైన్ తీసుకున్నాడు అజయ్ భూపతి. హైలీ సెక్సువల్ ఫీలింగ్స్ తో బాధపడే ఒక మానసిక రోగిగా పాయల్ ఇందులో నటించింది. తన వరకు ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసింది పాయల్ రాజ్‌పుత్. ఇలాంటి బోల్డ్ క్యారెక్టర్ చేయడం ఏ హీరోయిన్ కైనా సాహసమే.. కానీ దాన్ని చేసి చూపించింది ఈ ముద్దుగుమ్మ. అజయ్ భూపతి కూడా తాను అనుకున్న లైన్ పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీదకు తీసుకొచ్చాడు. అన్నింటికంటే ముఖ్యంగా అదినీష్ లోక్నాథ్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రాణంగా నిలిచింది.
ఫస్ట్ హాఫ్ వరకు ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా హాయిగా వెళ్లిపోయిన మంగళవారం.. సెకండ్ హాఫ్ లో మాత్రం కాస్త తడబడింది అంటున్నారు ప్రేక్షకులు. ముఖ్యంగా సినిమాకు ప్రాణంగా నిలవాల్సిన పాయల్ ఎపిసోడ్ డైజెస్ట్ చేసుకోవడం కష్టం. ఇలాంటి క్యారెక్టర్ మన తెలుగులో ఊహించడం, దాన్ని జీర్ణించుకోవడం అంటే చిన్న విషయం కాదు. అయితే తన ఫ్రేమ్స్, సినిమాటోగ్రఫీ వర్క్, సౌండింగ్ తో సినిమా రేంజ్ పెంచేశాడు అజయ్ భూపతి. వరల్డ్ కప్ ఫీవర్ తట్టుకుంటే కచ్చితంగా మంగళవారం సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావడం ఖాయం. అన్నట్టు ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే సేఫ్ జోన్ కి వెళ్ళిపోయింది.