Mangalavaaram Review | విడుదలకు ముందే మంచి హైప్‌తో కొన్ని సినిమాలొస్తుంటాయి.. అలాంటి సినిమానే ‘మంగళవారం’ (Mangalavaaram), పాయల్ రాజ్‌పుత్ . మరి పెరిగిన అంచనాలు, పనిచేసిన వారి నమ్మకాలు నిజమయ్యాయా?.. అందరూ అనుకున్నట్టు ‘మంగళవారం’ జనరంజకంగా ఉందా? బెడిసికొట్టిందా? ఈ వివరాలు తెలుసుకునేముందు కాసేపు కథలోకెళ్దాం..

సినిమా : మంగళవారం
తారాగణం: పాయల్ రాజ్‌పుత్, అజ్మల్ అమీర్, నందితాశ్వేత, రవీంద్రవిజయ్, చైతన్యకృష్ణ..
దర్శకత్వం: అజయ్ భూపతి
నిర్మాతలు: శ్వేతారెడ్డి గునుపాటి, సురేశ్‌వర్మ ఎం., అజయ్ భూపతి..
విడుదలకు ముందే మంచి హైప్‌తో కొన్ని సినిమాలొస్తుంటాయి.. అలాంటి సినిమానే ‘మంగళవారం’ (Mangalavaaram), పాయల్ రాజ్‌పుత్ . ఈ సినిమాకు నిర్మాణంలో ఉన్నప్పుడే జనాల్లో తెలీని వైబ్ క్రియేటయింది. పైగా ‘ఆర్‌ఎక్స్ 100’ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడం, దానికితోటు థ్రిల్లర్ సినిమా అవ్వడం, ప్రచారచిత్రాల్లో ‘కాంతారా’ షేడ్స్ కనిపించడం.. ఇవన్నీ సినిమాపై అంచనాలు పెరగటానికి కారణమయ్యాయి. ప్రమోషన్‌లో భాగంగా దర్శకుడు అజయ్ భూపతి (Ajay Bhupathi), కథానాయిక పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) ఈసినిమాపై చెప్పలేనంత నమ్మకాన్ని కనబరిచారు. పాయల్ ఒక అడుగు ముందుకేసి ఇండియన్ స్క్రీన్‌పై ఇలాంటి కథ రాలేదని స్టేట్‌మెంట్ కూడా ఇచ్చేసింది. మరి పెరిగిన అంచనాలు, పనిచేసిన వారి నమ్మకాలు నిజమయ్యాయా?.. అందరూ అనుకున్నట్టు ‘మంగళవారం’ జనరంజకంగా ఉందా? బెడిసికొట్టిందా? ఈ వివరాలు తెలుసుకునేముందు కాసేపు కథలోకెళ్దాం..
కథ గురించి..
ఊర్లో ప్రతి మంగళవారం అక్రమసంబంధం కలిగివున్న జంట భయంకరంగా హత్యకు గురవుతుంటారు. వారి బండారాన్ని ఓ అగంతకుడు ఊళ్లో ఏదో ఒక గోడమీద రాసి ఆ జంటను చంపుతుంటాడు. ఆ మిస్టరీని ఛేదించటానికి లేడీ ఎస్‌ఐ రంగంలోకి దిగుతుంది. కానీ ఊరు సహకరించదు. అసలు ఈ హత్యలు ఎవరు చేస్తున్నారో తెలుసుకోటానికి ఊరుఊరూ నడుంబిగించి రాత్రుళ్లు వెతకడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఆ ఊరుకి సంబంధించిన ఓ కుర్రాడు గోడమీద రాస్తూ ఊరిజనానికి దొరికిపోతాడు. వాడ్ని తన్నీ స్టేషన్‌కి అప్పజెబుతారు. అయితే, మరణించిన శవాల పోస్ట్‌మార్టం రిపోర్ట్ ప్రకారం చంపింది ఆ దొరికిన కుర్రాడు కాదు. దాంతో అతడ్ని పోలీసులు వదిలేస్తారు. ఇంతకీ ఆ హత్యలకు కారణం ఏంటి? ఎవరు చంపుతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగిలినకథ.
కథా విశ్లేషణ..
కథ డిమాండ్ మేరకు కథనం నడవాలి. అంతేకానీ మన సౌలభ్యానికి తగ్గట్టు కథనం నడవకూడదు. దాన్ని ఫోర్స్‌డ్ స్క్రీన్‌ప్లే అంటారు. ఈ సినిమాలో దాదాపు మొత్తం ఫోర్స్‌డ్ స్క్రీన్‌ప్లేనే కనిపిస్తుంది. ప్రథమార్థం మొత్తం ఊరిని పరిచయం చేయడమే సరిపోతుంది. దాదాపు సగం సినిమా పూర్తయ్యేదాకా ప్రేక్షకుడ్ని దర్శకుడు ఛీట్ చేస్తూనేవుంటాడు. మన మెదళ్లలో తలెత్తిన కొశ్చన్ మార్కులకు ద్వితీయార్థం మొత్తం సమాధానాలిచ్చుకుంటూ ఒక్కోముడి విప్పుకుంటూ వెళ్లాడు దర్శకుడు అజయ్‌భూపతి. సెకండాఫ్‌లో ప్రేక్షకులకు సమాధానాలు దొరుకుతూవుంటాయి కానీ.. అవేవీ ఒప్పించేలా వుండవ్. చివరకు సవాలక్ష సందేహాలతో సినిమా ముగుస్తుంది. సినిమా మొత్తం జల్లెడపడితే స్క్రీన్‌ప్లే పరంగా జమీందార్ భార్యగా నటించిన దివ్య పిైళ్లె పాత్ర మాత్రమే ఆడియన్‌ని కాస్తంత థ్రిల్‌కి గురిచేస్తుంది. మిగిలిన ఏ పాత్రకూ అంతసీన్ లేదు.
నటీనటుల నటన..
అజయ్ భూపతి అందరి దగ్గరనుంచి చక్కని నటన రాబట్టుకున్నాడు. ముఖ్యంగా పాయల్ రాజ్‌పుత్‌ది చాలా బరువైన పాత్ర. చక్కని నటన కనపరిచింది. అజ్మల్ పాత్ర చిన్నదే అయినా కథలో కీలకం. ఉన్నంతలో బాగా చేశాడు. ఇతర పాత్రధారులందరూ బాగా నటించారు. సినిమా చివర్లో ప్రియదర్శి తళుక్కున మెరిశాడు. కథలో అతనిది చాలా ముఖ్యమైన పాత్ర. అద్భుతంగా నటించాడు. ఆర్‌ఎంపీ డాక్టర్‌గా రవీంద్రవిజయ్ నటన ఈ సినిమాకు హైలైట్. ఈ సినిమాలో చాలామంది కొత్తవాళ్లు తెరకు పరిచయం అయ్యారు.
టెక్నికల్‌గా..
దర్శకుడిగా అజయ్‌భూపతి పెద్దగా మెరిసిందేం లేదు. అతనిపై ‘కాంతారా’ ప్రభావం బాగా ఉంది. కానీ మాస్కులు పెట్టుకొని కనిపించే సినిమాలన్నీ ‘కాంతారా’ కావు. స్క్రిప్ట్‌మీద ఇంకొన్ని రోజులు పనిచేస్తే బావుండేదేమో అనిపిస్తుంది. ‘కాంతారా’ఫేం అజనీష్ లోక్‌నాథ్ నేపథ్య సంగీతం చాలాబావుంది. అలాగే దాశరథి శివేంద్ర కెమెరా పనితనం కూడా చాలాబావుంది. ఫస్ట్‌హాఫ్ విషయంలో ఎడిటర్‌గారికి ఇంకాస్త పనుందని అనిపిస్తుంది. మొత్తంగా సాంకేతికంగా సినిమా బావుంది. నిర్మాతలు కూడా ఖర్చుకు వెనకాడలేదు. కథ, కథనాల్లోనే లోపాలు కనిపిస్తాయి. ఈ విషయంలో దర్శకుడు కాస్త శ్రద్ధ పెడితే బావుండేది. మొత్తంగా థ్రిల్లర్ కథల్ని ఇష్టపడే వారికి ‘మంగళవారం’ నచ్చొచ్చు.
ప్లస్ పాయింట్స్:
పాయల్ రాజ్‌పుత్‌తోపాటు నటీనటుల నటన, నేపథ్య సంగీతం, కెమెరా..
మైనస్ పాయింట్స్
ప్రథమార్థం, కథనం..
రేటింగ్ : 2.25/5
గణగణ మోగాలిరా ఫుల్ లిరికల్ వీడియో సాంగ్..
షూటింగ్ అప్‌డేట్..