మెగాస్టార్ చిరంజీవి, ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ కాంబినేషన్‌లో ఈ భారీ బడ్జెట్‌తో సోషియో ఫాంటసీ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే ఇందులో చిరు సరసన అనుష్క శెట్టి, మృణాల్ ఠాకూర్ నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు సునీల్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని సమాచారం. చిరు, సునీల్‌లది మంచి కాంబినేషన్. చిరంజీవి ఇంద్ర, స్టాలిన్, అందరివాడు, జై చిరంజీవా, గాడ్ ఫాదర్ చిత్రాల్లో మెరిశాడు సునీల్. ఇప్పుడు ఈ వశిష్ట చిత్రంలో కూడా సునీల్ ఓ పవర్ఫుల్ క్యారెక్టర్లో నటిస్తున్నడని తెలుస్తోంది.
ఇక పుష్ప తర్వాత తన రూటు మార్చుకొని కొన్ని విలక్షణమైన పాత్రలతో అలరిస్తున్నారు సునీల్. ఇటివలే జైలర్‌తో పాటు జపాన్‌లో కూడా మంచి పాత్రలో కనిపించారు. చిరంజీవి చిత్రంలో కూడా సునీల్ పాత్ర గుర్తుపెట్టుకునేలా ఉంటుందని తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రానికి ‘విశ్వంభర’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.