Rashmika Mandanna | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా సంబంధించిన ఓ డీప్‌ఫేక్ వీడియో (deepfake video) వైరల్ అయిన విషయం తెలిసిందే. జారా పటేల్(Zara Patel) అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించిన వీడియోకి రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది.

Rashmika Mandanna | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా సంబంధించిన ఓ డీప్‌ఫేక్ వీడియో (deepfake video) వైరల్ అయిన విషయం తెలిసిందే. జారా పటేల్(Zara Patel) అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించిన వీడియోకి రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఇక దీనిపై నెటిజన్లు, రష్మిక అభిమానులే కాదు పలువురు స్టార్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అమితాబ్ బచ్చన్ మొదలుకుని, విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), నాగ చైతన్య, సాయి ధరమ్ తేజ్, మృణాల్ ఠాకూర్, కీర్తి సురేశ్ ఇలా టాలీవుడ్ ప్రముఖులు అందరూ రష్మికకు మద్దతుగా నిలిచారు. దీనిపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వీడియోకు సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కూడా స్పందిస్తూ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కి కొత్త నియమ నిబంధనలను పంపింది. ఆ నిబంధనలను ఉల్లంఘిస్తే జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా కూడా విధిస్తామని తెలిపింది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ ఘటనపై రష్మిక మందన్నా మాజీ లవర్ కన్నడ హీరో రక్షిత్ శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రక్షిత్ శెట్టి నటించిన తాజా చిత్రం సప్త సాగరాలు దాటి సైడ్-బీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్ వచ్చిన రక్షిత్ వరుసగా తెలుగు ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యాడు. ఇక ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రక్షిత్ శెట్టి రష్మిక డీప్ ఫేక్ వీడియో పై స్పందించారు.
”డీప్‌ఫేక్ వీడియో వంటి ఘటనలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ప్రతి సాఫ్ట్ వేర్ కి లైసెన్స్ ఖచ్చితం అనే రూల్ తీసుకురావాలి. ప్రస్తుతం ఇలాంటి సాఫ్ట్ వేర్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. వాటిని ముందు అరికట్టాలి. రష్మిక తన కెరీర్ కోసం ఎన్నో కలలుగంటోంది అవి నేరవేరాలి” అంటూ రక్షిత్ శెట్టి చెప్పుకొచ్చాడు.
‘కిరిక్ పార్టీ’ అనే సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది రష్మిక మందన్న. ఈ సినిమాలో హీరోగా రక్షిత్ శెట్టి నటించగా కాంతర ఫేమ్ రిషబ్ శెట్టి దర్శకత్వం వహించాడు. 2017లో విడుదలైన ఈ చిత్రం కన్నడలో బిగ్గెస్ట్ బ్లక్ బస్టర్‌గా నిలిచింది. ఇక ఈ మూవీ టైంలోనే రష్మిక మందన్నా, రక్షిత్ శెట్టి ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఇంట్లో పెద్దలను ఒప్పించి ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. అయితే అనుకోని కారణాల వల్ల తమ నిశ్చితార్థంను బ్రేక్ చేసుకుని ఎవరి లైఫ్‌లో వాళ్ళు బిజీ అయ్యారు