Thalaivar 171 | తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ఇప్పటికే తలైవా 170 (Thalaivar 170) తో బిజీగా ఉన్నాడని తెలిసిందే. జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. మరోవైపు లోకేశ్ కనగరాజ్ (lokesh kanagaraj) దర్శకత్వంలో తలైవా 171 (Thalaivar 171)కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు రజినీకాంత్.

Thalaivar 171 | తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ఇప్పటికే తలైవా 170 (Thalaivar 170) తో బిజీగా ఉన్నాడని తెలిసిందే. జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. మరోవైపు లోకేశ్ కనగరాజ్ (lokesh kanagaraj) దర్శకత్వంలో తలైవా 171 (Thalaivar 171)కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు రజినీకాంత్. ఖైదీ, విక్రమ్, లియో లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను ఇండస్ట్రీకి అందించిన లోకేశ్ కనగరాజ్-రజినీకాంత్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందోనని ఎప్పుడు స్టార్ట్ అవుతుందా.. ఎప్పుడు అప్‌డేట్‌లు ఇస్తారా అని ఫ్యాన్స్ ఎక్జయిటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ఒక సాలిడ్ అప్‌డేట్ వచ్చింది.
దర్శకుడు లోకేశ్ కనగరాజ్ రీసెంట్‌గా ‘అవల్ పెయిర్ రజనీ’ అనే తమిళ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌కు హాజరయ్యాడు. ఈ ఈవెంట్‌లో అభిమానులు తలైవా 171 అప్‌డేట్ గురించి అడుగగా లోకేశ్ కనగరాజ్ స్పందిస్తూ.. 2024 ఏప్రిల్ నుంచి ఈ మూవీ పట్టాలెక్కబోతున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం కథ రాసుకుంటున్న తొందర్లోనే పూర్తి చేసి ఏప్రిల్‌లో షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపాడు.
ఈ చిత్రాన్ని లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తోండగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. రజినీకాంత్ మరోవైపు ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్షన్‌లో లాల్‌సలామ్ సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 2024 పొంగళ్ కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో విలన్‌గా కోలీవుడ్ స్టార్ హీరో రాఘవా లారెన్స్ (Raghava Lawrence) నటిస్తున్నాడని సమాచారం. అయితే ఇప్పటివరకు ఈ న్యూస్‌పై అధికారికంగా సమాచారం లేదు. కానీ త్వరలోనే మూవీ టీం నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.