Tiger 3 Movie | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) టైగర్ ప్రాంఛైజీ సినిమాలకు క్రేజ్ ఎలా ఉంటుందో తెలిసిందే. ఇదే జోనర్‌లో వచ్చిన టైగర్ 3 మరోసారి ఈ క్రేజ్‌ను బాక్సాఫీస్‌ను రుచి చూపించింది. మనీశ్ శర్మ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం టైగర్ 3 (Tiger 3).

Tiger 3 Movie | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) టైగర్ ప్రాంఛైజీ సినిమాలకు క్రేజ్ ఎలా ఉంటుందో తెలిసిందే. ఇదే జోనర్‌లో వచ్చిన టైగర్ 3 మరోసారి ఈ క్రేజ్‌ను బాక్సాఫీస్‌ను రుచి చూపించింది. మనీశ్ శర్మ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం టైగర్ 3 (Tiger 3). కత్రినాకైఫ్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషించిన టైగర్ 3 దీపావళి కానుకగా నవంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సక్సెస్‌ఫుల్‌గా స్క్రీనింగ్ అవుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిల్తుస్తోంది.
ఇక సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోన్న నేపథ్యంలో ప్రేక్షకులు, అభిమాన లోకానికి ధన్యవాదాలు తెలియజేశాడు సల్మాన్ ఖాన్. ఈ నేపథ్యంలోనే టైగర్ టీమ్ అంతా ముంబయిలోని ఓ థియేటర్‌కు వెళ్లి సందడి చేసింది. ఇక అభిమానుల కోరిక మేరకు టైగర్ 3 సినిమాలోని ఒక పాటకు సల్మాన్ ఖాన్ – కత్రినాకైఫ్ కలిసి డ్యాన్స్ కూడా చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
టైగర్ 3 ఇప్పటివరకు గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.30 కోట్లు వసూళ్లు రాబట్టింది. వీటిలో ఇండియా నుంచి రూ.220 కోట్లకు పైగా.. ఓవర్సీస్ నుంచి 80 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. టైగర్ ప్రాంఛైజీలో ఏక్తా టైగర్, టైగర్ జిందా హై తర్వాత వచ్చిన సినిమా కావడం, అంచనాలకు టైగర్3 ఏ మాత్రం తగ్గకపోవడంతో అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్యా చోప్రా తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రీతమ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.
Vibe 🔛#Tiger3InCinemas | #LekePrabhuKaNaam pic.twitter.com/o4UQwI0PXO
— Yash Raj Films (@yrf) November 17, 2023
It’s time to 🎉 with #Tiger3 team #Tiger3InCinemas pic.twitter.com/AerikF83Bz
— Yash Raj Films (@yrf) November 17, 2023