Zebra Movie | సహాయ నటుడిగా కెరీర్ ప్రారంభించి.. ‘జ్యోతిలక్ష్మి’ (Jyothi lakshmi) సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారాడు సత్యదేవ్ (Satyadev). ఆయన సినిమాలు భారీ రేంజ్‌లో హిట్లు కాకపోయినా.. ఉన్నంతలో కాస్త బెటర్‌గానే పర్‌ఫార్మ్ చేస్తుంటాయి. కెరీర్ బిగెనింగ్ నుంచి సత్యదేవ్ కథా బలమున్న సినిమాలనే చేస్తూ వస్తున్నాడు.

Zebra Movie | సహాయ నటుడిగా కెరీర్ ప్రారంభించి.. జ్యోతిలక్ష్మి (Jyothi lakshmi) సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారాడు సత్యదేవ్ (Satyadev). ఆయన సినిమాలు భారీ రేంజ్‌లో హిట్లు కాకపోయినా.. ఉన్నంతలో కాస్త బెటర్‌గానే పర్‌ఫార్మ్ చేస్తుంటాయి. కెరీర్ బిగెనింగ్ నుంచి సత్యదేవ్ కథా బలమున్న సినిమాలనే చేస్తూ వస్తున్నాడు. హీరోగానే కాకుండా మధ్య మధ్యలో కీలక పాత్రల్లోనూ మెరుస్తున్నాడు. ప్రస్తుతం సత్యదేవ్ మూడు సినిమాలను లైన్‌లో పెట్టాడు. అందులో ‘జీబ్రా’ ఒకటి. ఈశ్వర్ కార్తీక్ (Eswar Karthik) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరిని ఆకట్టుకుంది. కాగా ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ ఓ సాలిడ్ అప్‌డేట్‌ను ప్రకటించారు.
ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ పూర్తయినట్లు మేకర్స్ సోషల్ మీడియాలో ప్రకటించారు. అంతేకాకుండా ‘జీబ్రా’ చిత్రం యాక్షన్ క్రైమ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుందని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టినట్లు, త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో సత్యదేవ్‌కు జోడీగా ప్రియా భవానీ శంకర్, నటిస్తుంది. పుష్పా సినిమాతో ఫేమస్ అయిన ధనంజయ (జాలిరెడ్డి) ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. కాగా ఈ చిత్రాన్ని ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, బాలసుందరం, దినేష్ సుందరం సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Shoot WRAP 🎬#Zebra
Releasing soon in cinemas ❤️🔥 @ActorSatyaDev @Dhananjayaka @priya_Bshankar @JeniPiccinato @EashvarKarthic @SNReddy09 @balaSundaram_OT @OldTownPictures @padmajafilms_ @RaviBasrur @DOPsathya @anilkrish88 @Debore_ @UrsVamsiShekar pic.twitter.com/p9KusNpWiS
— padmajafilms (@padmajafilms_) November 18, 2023