అలాంటి సీన్‌ చేయలేదు!-Namasthe Telangana

[ad_1]

‘తమిళంలో నేను పోలీస్‌ క్యారెక్టర్స్‌ చాలా చేశాను. కానీ తెలుగులో మాత్రం ఇదే మొదటిసారి. నా దృష్టిలో కథే హీరో. ఈ సినిమాలో పాత్రపరంగా చాలా కొత్తగా కనిపించే ప్రయత్నం చేశా’ అని చెప్పింది వరలక్ష్మీ శరత్‌కుమార్‌.


అలాంటి సీన్‌ చేయలేదు!

‘తమిళంలో నేను పోలీస్‌ క్యారెక్టర్స్‌ చాలా చేశాను. కానీ తెలుగులో మాత్రం ఇదే మొదటిసారి. నా దృష్టిలో కథే హీరో. ఈ సినిమాలో పాత్రపరంగా చాలా కొత్తగా కనిపించే ప్రయత్నం చేశా’ అని చెప్పింది వరలక్ష్మీ శరత్‌కుమార్‌. ఆమె ఓ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్‌’. రాహుల్‌ విజయ్‌, శివానీ రాజశేఖర్‌ జంటగా నటించిన ఈ చిత్రానికి తేజ మార్ని దర్శకుడు.

ఈ నెల 24న విడుదలకానుంది. ఈ సందర్భంగా వరలక్ష్మీ శరత్‌కుమార్‌ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను, శ్రీకాంత్‌ పోలీస్‌ ఆఫీసర్స్‌ పాత్రల్లో కనిపిస్తాం. ఇద్దరిలో ఒకరు క్రిమినల్‌ అయితే ఎలా ఉంటుంది? రాజకీయ ఒత్తిళ్లు ఎలా ఉంటాయి? అనే ఆంశాలు ఆసక్తికరంగా ఉంటాయి.

మలయాళ ‘నాయట్టు’కి రీమేక్‌ అయినా తెలుగులో చాలా మార్పులు చేశారు. ఈ సినిమాలో స్మోకింగ్‌ చేయడం కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఇప్పటివరకు ఏ సినిమాలో అలాంటి సీన్స్‌ చేయలేదు. పాత్రపరంగా కంపల్సరీ కాబట్టి చేయాల్సి వచ్చింది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలతో పాటు క్యారెక్టర్‌ నచ్చితే ఏ జోనర్‌ కథలోనైనా నటించడానికి సిద్ధంగా ఉన్నా’ అన్నారు.

[ad_2]

Leave a Comment