ఆస్పత్రిలో చేరిన త‌మిళ న‌టుడు విజయకాంత్‌-Namasthe Telangana

[ad_1]

Vijayakanth | దేశీయ ముర్పోక్కు ద్రావిడ కల‌గం (డీఎంయూడీ) వ్యవస్థాపకుడు, ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు, నటీనటుల సంఘం మాజీ అధ్యక్షుడు విజయకాంత్‌ అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని మయత్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Vijayakanth | ఆస్పత్రిలో చేరిన త‌మిళ న‌టుడు విజయకాంత్‌

Vijayakanth | దేశీయ ముర్పోక్కు ద్రావిడ కల‌గం (డీఎంయూడీ) వ్యవస్థాపకుడు, ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు, నటీనటుల సంఘం మాజీ అధ్యక్షుడు విజయకాంత్‌ అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని మయత్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆయనకు జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలు ఉన్నాయని, సాధారణ వైద్య పరీక్షల అనంతరం ఈ రాత్రికి ఇంటికి చేరుకుంటారని సమాచారం. ఇక చాలా కాలంగా విజయకాంత్ డయాబెటిస్ తో బాధపడుతున్న విష‌యం తెలిసిందే. ఈ కారణంతోనే ఆయన మూడు వేళ్లను డాక్టర్లు తొలగించారు. ప్రస్తుతం ఆయన నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇక ఆయన ఆరోగ్యం కూడా బాగా క్షీణించినట్టు వైద్యులు చెబుతున్నారు.

ఇక 70 ఏళ్ల వ‌య‌సున్న విజయకాంత్ తమిళ సినీ పరిశ్రమలో తనదైన ముద్రను వేశారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో సైతం అడుగుపెట్టి… డీఎండీకే పార్టీని స్థాపించారు.

Next article

[ad_2]

Leave a Comment