ప్రభాస్‌ సలార్‌ను నార్తిండియాలో రిలీజ్‌ చేస్తుందెవరో తెలుసా..?-Namasthe Telangana

0
63


Salaar | గ్లోబల్‌ స్టార్‌ హీరో ప్రభాస్‌ (Prabhas) టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రాల్లో ఒకటి సలార్‌ (Salaar). Salaar Part-1 Ceasefire డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషనల్‌ ఈవెంట్‌ను రెడీ చేసుకుంటుంది ప్రభాస్‌ టీం.


Salaar | ప్రభాస్‌ సలార్‌ను నార్తిండియాలో రిలీజ్‌ చేస్తుందెవరో తెలుసా..?

Salaar | గ్లోబల్‌ స్టార్‌ హీరో ప్రభాస్‌ (Prabhas) టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రాల్లో ఒకటి సలార్‌ (Salaar). కేజీఎఫ్‌ ఫేం ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో సలార్ రెండు పార్టులుగా వస్తోంది. Salaar Part-1 Ceasefire డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషనల్‌ ఈవెంట్‌ను రెడీ చేసుకుంటుంది ప్రభాస్‌ టీం.

సలార్‌ను కేరళలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్‌ సుకుమారన్ హోం బ్యానర్ పృథ్విరాజ్ ప్రొడక్షన్స్‌ హౌజ్‌ విడుదల చేయనుండగా.. నైజాంలో టాలీవుడ్‌ పాపులర్ ప్రొడక్షన్‌ బ్యానర్‌ మైత్రీ మూవీ మేకర్స్ సలార్‌ను విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే అప్‌డేట్స్ అందించారు మేకర్స్‌. అనిల్‌ తడని AA Films నార్తిండియాలో ఈ సినిమాను విడుదల చేయనుంది. ఈ బ్యానర్‌ గతంలో బాహుబలి సిరీస్‌, కేజీఎఫ్ సిరీస్‌, సైరా నరసింహారెడ్డి, 2.0 (హిందీ)లో విడుదల చేసింది. ఈ సినిమాలన్నీ దాదాపు మంచి హిట్స్‌గా నిలిచాయి. మరోసారి సలార్‌ను విడుదల చేస్తుండటంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఓవర్సీస్‌లో సలార్‌ను Phars Film Co LLC విడుదల చేస్తుంది.

సలార్ ట్రైలర్‌ డిసెంబర్ 1న రాత్రి 7:19 గంటలకు లాంఛ్ చేయనున్నారు మేకర్స్‌. సలార్‌లో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సలార్‌లో పృథ్విరాజ్‌ సుకుమారన్ (Prithviraj Sukumaran)‌ వరదరాజ మన్నార్ ది కింగ్ పాత్రలో నటిస్తుండగా.. వరదరాజ మన్నార్ ది కింగ్ లుక్‌ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తోంది.

సలార్‌ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన టీజర్‌లో గూస్‌బంప్స్‌ తెప్పించే విజువల్స్‌ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి.సలార్‌ టీజర్‌ నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్‌ తెరకెక్కిస్తున్న సలార్‌ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

నార్తిండియాలో..

ఓవర్సీస్‌లో..

నైజాం ఏరియాలో..

కేరళలో ..

సలార్ టీజర్‌..

 

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here