Akhil Akkineni | టాలీవుడ్ యువ నటుడు అఖిల్ అక్కినేని (Akhil Akkineni) ఈ ఏడాది ఏజెంట్ సినిమాతో ప్లాప్‌ను ఖాతాలో వేసుకున్నాడని తెలిసిందే. తాజాగా ఇదే ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ డెవలప్ మెంట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. వచ్చే నెలలో అఖిల్ కొత్త సినిమా గ్రాండ్‌గా లాంఛ్ కానుందట.

Akhil Akkineni | టాలీవుడ్ యువ నటుడు అఖిల్ అక్కినేని (Akhil Akkineni) ఈ ఏడాది ఏజెంట్ సినిమాతో ప్లాప్‌ను ఖాతాలో వేసుకున్నాడని తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. నిర్మాతలకు భారీ నష్టాలనే మిగిల్చిందని ట్రేడ్ సర్కిల్ టాక్. ఇదిలా ఉంటే అఖిల్ టాప్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ లో ఓ సినిమా ప్రకటించాల్సి ఉండగా.. వర్కవుట్ కాలేదు. తాజాగా ఇదే ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ డెవలప్ మెంట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. వచ్చే నెలలో అఖిల్ కొత్త సినిమా గ్రాండ్‌గా లాంఛ్ కానుందట.
ఈ చిత్రం రూ.100 కోట్ల బడ్జెట్‌తో రాబోతుందని ఫిలింనగర్ సర్కిల్ ఇన్‌సైడ్ టాక్. ఏజెంట్ భారీ ఫ్లాప్ తర్వాత అఖిల్‌తో చేస్తున్న సినిమాకు యూవీ క్రియేషన్స్ (UV Creations)భారీ మొత్తంలో ఖర్చు పెడుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. మరి ఈ సినిమా అయినా అఖిల్‌కు మంచి సక్సెస్‌ను తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నారు మూవీ లవర్స్, అక్కినేని అభిమానులు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాతో యావరేజ్ హిట్టందుకున్న అఖిల్ ఈ సారి ఎలాగైనా హిట్టు కొట్టాలని కసిగా ఎదురుచూస్తున్నాడు.
మరి యూవీ క్రియేషన్స్‌లో వచ్చే సినిమా అయినా అఖిల్‌కు కలిసొస్తుందేమో చూడాలంటున్నారు సినీ జనాలు. ఇంతకీ డైరెక్టర్ ఎవరనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.