Allari Naresh | టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు దివంగత ఈవీవీ సత్యనారాయణ (EVV) తనయుడిగా ఎంట్రీ ఇచ్చి సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు హీరో నరేష్. తొలి ప్రయత్నంలోనే ‘అల్లరి’తో హిట్ కొట్టి.. సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నారు. అయితే కొంతకాలంగా ఆయన సీరియస్ కథలపై దృష్టిపెట్టారు.

Allari Naresh | టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు దివంగత ఈవీవీ సత్యనారాయణ (EVV) తనయుడిగా ఎంట్రీ ఇచ్చి సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు హీరో నరేష్. తొలి ప్రయత్నంలోనే ‘అల్లరి’తో హిట్ కొట్టి.. సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నారు. అయితే కొంతకాలంగా ఆయన సీరియస్ కథలపై దృష్టిపెట్టారు. ఈ క్రమంలో ‘నాంది’, ‘ఉగ్రం’, ‘ఇట్లు మారేడుమిల్లి’ చిత్రాలు చేశారు. ఇప్పుడు ‘సోలో బ్రతుకే సో బెటరు’ ఫేం సుబ్బు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా కూడా సీరియస్ బ్యాక్‌డ్రాప్‌లోనే వుంటుందని తెలుస్తుంది.
ఇక అల్లరి నరేశ్‌కి ఇది 62వ చిత్రం. ఈ సినిమా కథ 1990 నేపథ్యంలో వుంటుంది. రాజేశ్ దండా, బాలాజీ గుత్తా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘‘మనిషిలో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఎంతున్నాయో కనుక్కోవడానికి మెషిన్స్ ఉన్నాయి. కానీ మూర్ఖత్వం ఎంతుందో కనుక్కోవడానికి ఏ మెషిన్లు లేవు. అలాంటి మూర్ఖత్వం హద్దులు దాటేసినవాడి కథే ఇది” అంటూ ఇప్పటికే రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ టీజర్ ఆసక్తిని పెంచింది.
కాగా ఈ చిత్రానికి ‘బచ్చల మల్లి’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. తుని ప్రాంతంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. త్వరలోనే టైటిల్ ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్.