ANIMAL- Arjan Vailly | ‘యానిమల్’ మోస్ట్ అవైటెడ్ ‘అర్జన్ వాయ్లీ’ సాంగ్ రిలీజ్-Namasthe Telangana

[ad_1]

ANIMAL- Arjan Vailly | అర్జున్‌ రెడ్డి (Arjun Reddy) ఫేమ్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Vanga) ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న తాజా చిత్రం ‘యానిమల్’(Animal). రణబీర్ కపూర్ (Ranbir Kapoor), రష్మిక మంధాన (Rashmika Mandana) హీరో హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి టీజ‌ర్‌తో పాటు పాట‌లు విడుద‌ల కాగా ప్రేక్ష‌కుల‌ను ఓ రేంజ్‌లో ఊపేస్తున్నాయి.


ANIMAL- Arjan Vailly | ‘యానిమల్’ మోస్ట్ అవైటెడ్ ‘అర్జన్ వాయ్లీ’ సాంగ్ రిలీజ్

ANIMAL- Arjan Vailly | అర్జున్‌ రెడ్డి (Arjun Reddy) ఫేమ్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Vanga) ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న తాజా చిత్రం ‘యానిమల్’(Animal). రణబీర్ కపూర్ (Ranbir Kapoor), రష్మిక మంధాన (Rashmika Mandana) హీరో హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి టీజ‌ర్‌తో పాటు పాట‌లు విడుద‌ల కాగా ప్రేక్ష‌కుల‌ను ఓ రేంజ్‌లో ఊపేస్తున్నాయి. ఇక ఈ సినిమా డిసెంబర్‌ 1న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ సాలీడ్ అప్‌డేట్ ఇచ్చారు.

ఈ మూవీ నుంచి ఫోర్త్ సింగిల్ ‘అర్జన్ వాయ్లీ’ లిరికల్‌ సాంగ్‌ను మేక‌ర్స్ లాంఛ్ చేశారు. ఇక ఈ పాట మోస్ట్ వైలెంట్ సాంగ్‌గా ఉండ‌నున్న‌ట్లు తెలుస్తుంది. భూపిందర్ బబ్బల్ ఈ పాటను రాసి అత‌నే పాడాడు. మనన్ భరద్వాజ్ సంగీతం అందించాడు. ఇక సినిమా థీమ్‌ను ప్రతిబింబించేలా పాట ఉండబోతున్నట్టు రషెస్ చెబుతున్నాయి.

యానిమల్‌ హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రంలో బాబీ డియోల్‌, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పవర్‌ ఫుల్‌ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా, బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సూపర్ థ్రిల్ అందించేలా యానిమల్‌ ఉండబోతుందని ఇప్పటివరకు విడుదల చేసిన రషెస్‌ చెబుతున్నాయి‌. యానిమల్‌ చిత్రాన్ని భూషణ్ కుమార్‌, ప్రణయ్‌ రెడ్డి వంగా, కృషన్‌ కుమార్‌, మురద్‌ ఖేతని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్‌ 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.

Next article[ad_2]

Leave a Comment