Bhagavanth Kesari | నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) టైటిల్ రోల్ పోషించిన తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’ (bhagavanth Kesari). అనిల్ రావిపూడి (Anil Ravipudi) డైరెక్షన్‌లో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై మంచి విజయం సాధించింది.

Bhagavanth Kesari | నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) టైటిల్ రోల్ పోషించిన తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’ (bhagavanth Kesari). అనిల్ రావిపూడి (Anil Ravipudi) డైరెక్షన్‌లో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై మంచి విజయం సాధించింది. ఫస్ట్ డే నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం 30 రోజులు పూర్తయ్యేసరికి వరల్డ్‌వైడ్‌గా రూ.140 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ ‘ఉయ్యాలో ఉయ్యాలా’ (Uyyalo Uyyala) అనే సాంగ్ ఫుల్ వీడియోను నవంబర్ 04 న విడుదల చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కారణం ఏంటో తెలిదు కానీ.. ఈ పాట విడుదల చేసిన కొద్ది సేపటికే మళ్లీ ఆ వీడియోను యూట్యూబ్ నుంచి డిలీట్ చేశారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ‘ఉయ్యాలో ఉయ్యాలా’ పాటను మళ్లీ యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఉడతా ఉడతా హుషా హుష్.. సప్పుడు సేయకుర్రీ.. నీ కన్నా మస్తుగ ఉరుకుతాంది మా సిట్టి సిన్నారీ’ ఉయ్యాలో ఉయ్యాలా.. అంటూ తెలంగాణ భాష, యాసలో సాగిన ఈ పాటను అనంతశ్రీరామ్ లిరిక్స్ అందించగా.. యస్.పి.చరణ్ ఆలపించారు. తమన్ స్వరాలందించాడు. ఇక ఈ హార్ట్ టచింగ్ మెలోడీని మీరు చూసేయండి.
The most loved #UyyaaloUyyaala Video Song from #BlockbusterBhagavanthKesari is out now❤️🔥
– https://t.co/cJFOtAMT2v#BhagavanthKesari In cinemas now❤️#NandamuriBalakrishna @AnilRavipudi @sreeleela14 @MusicThaman @IananthaSriram @Shine_Screens @JungleeMusicSTH pic.twitter.com/zrZdLYnhEN
— Vamsi Kaka (@vamsikaka) November 18, 2023
ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటించగా.. శ్రీలీల కీలక పాత్ర పోషించింది. బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించగా.. ఆర్ శరత్‌కుమార్, రఘుబాబు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. ఎస్ థమన్ సంగీతం అందించాడు.