తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) మనవడు, హీరో ధనుష్ (dhanush) తనయుడు యాత్రకు తమిళనాడు పోలీసులు జరిమానా విధించారు. ధనుష్-ఐశ్వర్య రజనీకాంత్‌ల పెద్ద కుమారుడే యాత్ర. కొన్ని రోజుల కిందట ఓ స్పోర్ట్స్ బైక్ పై రయ్యిమంటూ దూసుకెళుతూ కనిపించాడు.

Rajinikanth Grandson | తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) మనవడు, హీరో ధనుష్ (dhanush) తనయుడు యాత్రకు తమిళనాడు పోలీసులు జరిమానా విధించారు. ధనుష్-ఐశ్వర్య రజనీకాంత్‌ల పెద్ద కుమారుడు యాత్ర కొన్ని రోజుల కిందట ఓ స్పోర్ట్స్ బైక్ పై రయ్యిమంటూ దూసుకెళుతూ కనిపించాడు. అయితే ఆ సమయంలో యాత్రకు హెల్మెట్ లేదు. అతను తన తాత రజనీకాంత్ ఇంటి నుండి తన తండ్రి ధనుష్ ఇంటికి బైక్ పై వెళ్లినట్లు సమాచారం.
ఇక దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియోపై చెన్నై ట్రాఫిక్ పోలీసులు విచారణ చేపట్టగా అది ధనుష్ కొడుకు యాత్రది అని తేలింది. దీంతో ఈ విషయంపై ట్రాఫిక్ పోలీసులు ధనుష్ ఇంటికి వెళ్లి యాత్రకు సలహా ఇచ్చారు. అంతే కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపినందుకు యాత్రకు రూ.1000 జరిమానా విధించారు.