Dhruva Natchathiram | కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Vikram) నటిస్తున్న చిత్రాల్లో ఒకటి గౌతమ్ వాసు దేవ్ మీనన్ (Gautham Menon) డైరెక్ట్ చేస్తున్న ధ్రువ నక్షత్రం: యుద్ద కాండం (Dhruva Natchathiram). నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏదో ఒక అప్‌డేట్‌తో ఫ్యాన్స్‌లో జోష్ నింపుతోంది విక్రమ్ టీం.

Dhruva Natchathiram | కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Vikram) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి గౌతమ్ వాసు దేవ్ మీనన్ (Gautham Menon) డైరెక్ట్ చేస్తున్న ధ్రువ నక్షత్రం: యుద్ద కాండం (Dhruva Natchathiram). ఈ చిత్రంలో పెళ్లి చూపులు ఫేం రీతూవర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ధ్రువ నక్షత్రం నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏదో ఒక అప్‌డేట్‌తో ఫ్యాన్స్‌లో జోష్ నింపుతోంది విక్రమ్ టీం. ఇప్పటికే పలు పోస్టర్లు విడుదల చేయగా.. నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో లుక్‌ను విడుదల చేశారు.
విక్రమ్ సూట్‌కేస్ పట్టుకొని స్టైలిష్‌గా నడుచుకుంటూ వస్తున్న లుక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. విక్రమ్ చాలా కాలం తర్వాత సూపర్ స్టైలిష్‌గా కనిపించబోతున్నట్టు తాజా లుక్ చెబుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన తమిళ, తెలుగు ట్రైలర్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. మెడలో స్కార్ప్, స్టైలిష్ బ్లాక్ గాగుల్స్ వేసుకున్న విక్రమ్ చేతిలో పిస్తోల్ పట్టుకొని అగ్రెసివ్‌గా కనిపిస్తున్న లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.
ముంబై దాడులు జరిగినప్పుడు అక్కడికి ఎన్‌ఎస్‌జీ హెలికాప్టర్ రావడం బాగా ఆలస్యమైంది.. అంటూ సాగే డైలాగ్స్‌తో మొదలైన ధ్రువ నక్షత్రం ట్రైలర్.. సినిమా అతి ముఖ్యమైన మిషన్ నేపథ్యంలో సాగనున్నట్టు క్లారిటీ ఇచ్చేస్తుంది. ఈ మూవీలో ఐశ్వర్యారాజేశ్, సిమ్రాన్, రాధికా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని ఒండ్రగ ఎంటర్‌టైన్‌మెంట్, కొండదువోం ఎంటర్‌టైన్‌మెంట్, ఎస్కేప్ ఆర్టిస్ట్స్ మోషన్స్ పిక్చర్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తుండగా.. హరీష్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
యాక్షన్ స్పై జోనర్‌లో వస్తున్న ఈ చిత్రంలో విక్రమ్ జాన్/ధ్రువ్ పాత్రల్లో కనిపించబోతున్నాడు.ఈ మూవీ నుంచి ఇటీవలే కరిచేకళ్లే చూసి లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ వస్తోంది.
సూపర్ స్టైలిష్‌గా విక్రమ్..
#DhruvaNatchathiram – New poster..🔥 #ChiyaanVikram‘s Stylish Action Thriller is Finally gonna see the lights next week..🤙 pic.twitter.com/cLTxeXYU63
— Laxmi Kanth (@iammoviebuff007) November 17, 2023
ధ్రువ నక్షత్రం తాజా పోస్టర్..
A Pulsating Tale packed with High-Octane Action.
Meet at the Basement in 8 Days 💥 #DhruvaNatchathiramFromNov24 #DhruvaNakshathramFromNov24 #DhruvaNatchathiram #DhruvaNakshathram@chiyaan @menongautham @Jharrisjayaraj @riturv @OndragaEnt @Preethisrivijay @SonyMusicSouth… pic.twitter.com/pZcQLam0xs
— Oruoorileoru Film House (@oruoorileoru) November 16, 2023
ధ్రువ నక్షత్రం తెలుగు ట్రైలర్..
ధ్రువ నక్షత్రం తమిళ్ ట్రైలర్..
ధ్రువ నక్షత్రం టీజర్ ..
కరిచేకళ్లే చూసి లిరికల్ వీడియో సాంగ్..