spot_img
Thursday, December 7, 2023
HomeEntertainmentHi Nanna | త‌న పార్టీ మేనిఫెస్టో ప్ర‌క‌టించిన హీరో నాని.. వీడియో వైర‌ల్-Namasthe Telangana

Hi Nanna | త‌న పార్టీ మేనిఫెస్టో ప్ర‌క‌టించిన హీరో నాని.. వీడియో వైర‌ల్-Namasthe Telangana

-


Hi Nanna | టాలీవుడ్ హీరో న్యాచురల్‌ స్టార్ నాని (Nani) న‌టిస్తున్న తాజా చిత్రం హాయ్‌ నాన్న (Hi Nanna). నాని 30 (Nani 30)గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో శౌర్యువ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. టాలీవుడ్ భామ, సీతారామం ఫేం మృణాళ్‌ ఠాకూర్ ఈ హీరోయిన్‌గా నటిస్తోంది.


Hi Nanna | త‌న పార్టీ మేనిఫెస్టో ప్ర‌క‌టించిన హీరో నాని.. వీడియో వైర‌ల్

Hi Nanna | టాలీవుడ్ హీరో న్యాచురల్‌ స్టార్ నాని (Nani) న‌టిస్తున్న తాజా చిత్రం హాయ్‌ నాన్న (Hi Nanna). నాని 30 (Nani 30)గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో శౌర్యువ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. టాలీవుడ్ భామ, సీతారామం ఫేం మృణాళ్‌ ఠాకూర్ ఈ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి గ్లింప్స్‌తో పాటు ఫ‌స్ట్ సింగిల్, సెకండ్ సింగిల్‌ల‌ను లాంఛ్ చేయగా.. ప్రేక్ష‌కుల నుంచి విప‌రీత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా డిసెంబ‌ర్ 07న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో చిత్ర‌బృందం ప్ర‌మోష‌న్స్ వేగం పెంచింది. అయితే తెలంగాణలో ఎన్నిక‌ల ఫీవ‌ర్ న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో చిత్రబృందం ప్ర‌మోష‌న్స్‌ను వింత‌గా ప్లాన్ చేసింది. మేక‌ర్స్ దీనికి సంబంధించి ఇప్ప‌టికే రాజ‌కీయ నాయ‌కుడి గెట‌ప్‌లో ఉన్న నాని (Nani) పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

అయితే ఈ రాజ‌కీయ నాయ‌కుడి గెట‌ప్‌లో ఉన్న నాని తాజాగా ఒక వీడియో విడుద‌ల చేశారు. రిలీజ్ దెగ్గరలో ఉంది. ఎలక్షన్స్ మధ్యలో వున్నాయి. వాడేయటమే 😉 అంటూ ప్రెస్ మీట్‌లో పాల్గొన్నట్లు వీడియో ఉంది.

ఇక ఈ వీడియో చూస్తే.. మీ ‘హాయ్‌ నాన్న’ పార్టీ ప్రెసిడెంట్‌ విరాజ్‌’’ అని నాని మాట్లాడుతూ.. త‌న మేనిఫెస్టో ప్ర‌క‌టించాడు. మన హాయ్ నాన్న పార్టీ కనుక అధికారంలోకి వస్తే.. యూత్ అందరికి రీల్స్ చేసుకోడానికి విచ్చలవిడిగా స్మార్ట్ ఫోన్స్ అండ్ లైటింగ్ సెటప్ లు అన్ని కూడా కిట్లు కిట్ల కింద పంచి పెడతాం. అందరి ఆదాయం పెంచేలా చూస్తాం. థియేటర్‌ల ఆదాయం అలాగే వాటి పక్కన ఉన్న కిరాణా కొట్టుల ఆదాయం పెంచేలా చూస్తాం. అని ఫన్నీగా వీడియో చేశాడు. ఇక ఈ వీడియోలో లాస్ట్‌కు సోష‌ల్ రెస్పాన్సిబిలిటీ ఆడ్ చేస్తూ.. మా పార్టీకే ఓటు వేయండి అని పొలిటీషియన్స్ ఇలాంటి క‌బుర్లు ఎన్ని అయినా చెబుతారు. కానీ మీ మనసుకు తెలుసు. మీకు ఆలోచిస్తే అర్థమయిపోతుంది. మంచోడికే ఓటు వేయండి. అంటూ నాని చెప్పుకొచ్చారు.

ఇక ఈ మూవీలో నాని కూతురి పాత్రలో బేబి కైరా ఖన్నా నటిస్తోంది. ఈ చిత్రాన్ని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్‌ చెరుకూరి (CVM), డాక్టర్ విజేందర్‌ రెడ్డి తీగల, మూర్తి కేఎస్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు మలయాళ కంపోజర్‌, హృదయం, ఖుషీ చిత్రాల‌ ఫేం హెశమ్‌ అబ్దుల్‌ వహబ్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీకి ప్రవీణ్‌ ఆంటోనీ ఎడిటర్‌ కాగా.. జోతిష్‌ శంకర్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌గా వర్క్‌ చేస్తున్నాడు.

Next article



Related articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
3,912FollowersFollow
0SubscribersSubscribe
spot_img

Latest posts