Hi Nanna | టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani) నటిస్తున్న తాజా చిత్రం హాయ్ నాన్న (Hi Nanna). నాని 30 (Nani 30)గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. టాలీవుడ్ భామ, సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ ఈ హీరోయిన్‌గా నటిస్తోంది.

Hi Nanna | టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani) నటిస్తున్న తాజా చిత్రం హాయ్ నాన్న (Hi Nanna). నాని 30 (Nani 30)గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. టాలీవుడ్ భామ, సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ ఈ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్‌తో పాటు ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్‌లను లాంఛ్ చేయగా.. ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా డిసెంబర్ 07న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ వేగం పెంచింది. అయితే తెలంగాణలో ఎన్నికల ఫీవర్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్స్‌ను వింతగా ప్లాన్ చేసింది.
ఈ సినిమా నుంచి రాజకీయ నాయకుడి గెటప్‌లో ఉన్న నాని (Nani) పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌కు ఇది ఎన్నికల సీజన్. ఇందులో మనం ఎందుకు జాయిన్ కాకూడదు.. డిసెంబర్ 7న మీ ప్రేమను మాకు ఇవ్వాలి. మీ ఓటు మాకే వేయాలి. ఇట్లు.. మీ ‘హాయ్ నాన్న’ పార్టీ ప్రెసిడెంట్ విరాజ్’’ అని క్యాప్షన్ ఇచ్చింది. కాగా ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ప్రజల అభిమానం కోసం వచ్చేస్తున్నాడు మన @NameIsNani 😎
Unveiling the new party to all of you – #HiNannaParty ❤️
Unlimited love guaranteed 💯 #HiNanna #HiNannaOnDec7th pic.twitter.com/fptQltTxeF
— Vyra Entertainments (@VyraEnts) November 17, 2023
ఇక ఈ మూవీలో నాని కూతురి పాత్రలో బేబి కైరా ఖన్నా నటిస్తోంది. ఈ చిత్రాన్ని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు మలయాళ కంపోజర్, హృదయం, ఖుషీ చిత్రాల ఫేం హెశమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీకి ప్రవీణ్ ఆంటోనీ ఎడిటర్ కాగా.. జోతిష్ శంకర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నాడు.