Leo Movie | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, త్రిష జంటగా నటించిన చిత్రం ‘లియో'(Trisha). అక్టోబర్ 19న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.550 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలో గౌతమ్ మీనన్, అర్జున్, సంజయ్ దత్, మన్సూర్ ఆలీ ఖాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Leo Movie | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, త్రిష జంటగా నటించిన చిత్రం ‘లియో'(Trisha). అక్టోబర్ 19న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.550 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలో గౌతమ్ మీనన్, అర్జున్, సంజయ్ దత్, మన్సూర్ ఆలీ ఖాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇదిలా ఉంటే విజయ్ అభిమానులకు ఒక సర్‌ప్రైజ్ న్యూస్ వచ్చింది.
ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘నా రెడీ సాంగ్’ (Naa Ready) ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఈ పాటకు సంబంధించి మేకర్స్ ఫుల్ వీడియోను విడుదల చేశారు. విష్ణు ఎడవన్ రాసిన ఈ ట్రాక్‌ను తమిళంలో దళపతి విజయ్, అనిరుధ్ రవిచందర్ కలిసి పాడగా.. తెలుగులో ఈ పాటను రేవంత్ చేత పాడించారు. రఘురామ్ సాహిత్యం అందించాడు.