Nayanthara | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటీమణుల్లో టాప్ ప్లేస్‌లో ఉంటుంది నయనతార (Nayanthara). గ్లామరస్ పాత్రలు చేస్తూ.. మరోవైపు పర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్‌లో నటిస్తూ లేడీ సూపర్ స్టార్‌గా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది.

Nayanthara | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటీమణుల్లో టాప్ ప్లేస్‌లో ఉంటుంది నయనతార (Nayanthara). గ్లామరస్ పాత్రలు చేస్తూ.. మరోవైపు పర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్‌లో నటిస్తూ లేడీ సూపర్ స్టార్‌గా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది. తాజాగా ‘జవాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఇక నేడు నయనతార పుట్టినరోజు. 1984 నవంబర్ 18న ముంబైలో పుట్టిన ఈ ముద్దుగుమ్మ.. నేటితో 38 ఏళ్లు పూర్తిచేసుకుని 39లోకి అడుగుపెట్టింది. కాగా.. నయన్ బర్త్‌డే సందర్భంగా పలు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో విషెస్ తెలియజేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. నయన్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘టెస్ట్'(Nayanathara). ఆర్.మాధవన్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అయితే బర్త్‌డే కానుకగా ఈ సినిమా నుంచి నయన్ కొత్త పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో నయనతార ట్రేడిషనల్ లుక్‌తో ఆకట్టుకుంటుంది. ఇక వై నాట్ స్టూడియోస్ పతాకంపై చక్రవర్తి రామచంద్రన్, శశికాంత్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ముగ్గురి జీవితాలు క్రికెట్‌తో ఎలా ముడిపడ్డాయానేది ఈ సినిమా స్టోరీ అని మేకర్స్ వెల్లడించారు.
Happy Birthday #Nayanthara ! ✨#HBDNayanthara
– #theTEST🏏@sash041075 @chakdyn@ActorMadhavan #Nayanthara #Siddharth @studiosynot pic.twitter.com/fpbodwqBDL
— Vamsi Kaka (@vamsikaka) November 18, 2023