ఓవర్సీస్‌లో ప్రభాస్‌ మేనియా.. సలార్ ప్రీ సేల్స్‌ బిజినెస్‌ అదిరిందంతే..!-Namasthe Telangana

[ad_1]

Salaar | కేజీఎఫ్‌ ఫేం ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వం వహిస్తున్న చిత్రం సలార్ (Salaar) ‌. ప్రభాస్ టైటిల్ రోల్‌లో రెండు పార్టులుగా తెరకెక్కుతోంది. మేకర్స్‌ Salaar Part-1 Ceasefireను డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించేశారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏదో ఒక అప్‌డేట్ ప్రభాస్‌ టీంలో జోష్‌ నింపుతోంది.


Salaar | ఓవర్సీస్‌లో ప్రభాస్‌ మేనియా.. సలార్ ప్రీ సేల్స్‌ బిజినెస్‌ అదిరిందంతే..!

Salaar | గ్లోబల్‌ స్టార్‌ హీరో ప్రభాస్‌ (Prabhas) కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే క్రేజ్‌ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేజీఎఫ్‌ ఫేం ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వం వహిస్తున్న చిత్రం సలార్ (Salaar) ‌. రెండు పార్టులుగా తెరకెక్కుతోంది. మేకర్స్‌ Salaar Part-1 Ceasefireను డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించేశారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏదో ఒక అప్‌డేట్ ప్రభాస్‌ టీంలో జోష్‌ నింపుతోంది.

యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తోన్న సలార్ ట్రైలర్‌ డిసెంబర్ 1న రాత్రి 7:19 గంటలకు లాంఛ్ కానుందని తెలిసిందే. తాజాగా ఓవర్సీస్‌లో సలార్ టికెట్‌ బుకింగ్స్‌కు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. యూఎస్‌ఏలో సలార్‌ ప్రీ సేల్స్‌ (తాత్కాలిక)బిజినెస్‌ రూ.24,70,311గా నమోదైంది. పూర్తిస్థాయిలో బుకింగ్స్‌ నవంబర్ 20నుంచి మొదలుకానున్నాయి. యూకేలో కేవలం 7 గంటల్లోనే అత్యధికంగా 1200కుపైగా టికెట్స్ అమ్ముడుపోయాయంటే ప్రభాస్ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ప్రీ సేల్స్‌ బిజినెస్‌తోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తూ.. అంచనాలను అమాంతం పెంచేస్తోంది సలార్‌.

ఈ చిత్రాన్ని కేరళలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్‌ సుకుమారన్ హోం బ్యానర్ పృథ్విరాజ్ ప్రొడక్షన్స్‌ హౌజ్‌ విడుదల చేస్తోంది. మరోవైపు నైజాం ఏరియాలో టాలీవుడ్‌కు బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన పాపులర్ తెలుగు ప్రొడక్షన్‌ బ్యానర్‌ మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తుంది. సలార్‌లో పృథ్విరాజ్‌ సుకుమారన్ (Prithviraj Sukumaran)‌ వరదరాజ మన్నార్ ది కింగ్ పాత్రలో నటిస్తుండగా.. వరదరాజ మన్నార్ ది కింగ్ లుక్‌ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తోంది.

సలార్‌లో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. సలార్‌ టీజర్‌ ఇప్పటికే నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ టాక్ ఆఫ్ ది గ్లోబల్‌ ఇండస్ట్రీగా నిలుస్తోంది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్‌ తెరకెక్కిస్తున్న సలార్‌ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

నైజాం ఏరియాలో..

కేరళలో ..

సలార్ టీజర్‌..

 

 

Next article[ad_2]

Leave a Comment