ANIMAL Movie | అర్జున్ రెడ్డి (Arjun Reddy) ఫేమ్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Vanga) దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘యానిమల్’(Animal). రణబీర్ కపూర్ (Ranbir Kapoor), రష్మిక మంధాన (Rashmika Mandana) హీరో హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.

ANIMAL Movie | అర్జున్ రెడ్డి (Arjun Reddy) ఫేమ్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Vanga) దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘యానిమల్’(Animal). రణబీర్ కపూర్ (Ranbir Kapoor), రష్మిక మంధాన (Rashmika Mandana) హీరో హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు పాటలు విడుదల కాగా ప్రేక్షకులను ఓ రేంజ్‌లో ఊపేస్తున్నాయి. ఇక ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఒక సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రన్ టైమ్ సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఈ సినిమా రన్‌టైమ్ అక్షరాల 3 గంటల 21 నిమిషాలట. అదే నిజమైతే ఇటీవల కాలంలో విడుదలైన చిత్రాల్లో అత్యధిక నిడివి ఉన్న బాలీవుడ్ చిత్రం ఇదే కానుంది. 2016లో వచ్చిన ‘ధోనీ’ సినిమా (రన్‌టైన్ 3.10) తర్వాత 3 గంటలకు పైగా రన్ టైమ్ హిందీ చిత్రం ఇదే కావడం విశేషం. నిజానికి ఇంత లెంగ్తీ రన్‌టైమ్‌తో ఆడియెన్స్‌ను థియేటర్‌లకు కట్టిపడేయం కత్తి మీద సామే. అయితే బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. సినిమా టెర్రిఫిక్‌గా ఉందని, ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టుకుండా ఉంటుందని వినిపిస్తుంది.
ఇంత లెంగ్తీ రన్‌టైమ్ అంటే మల్టిప్లెక్స్ థియేటర్‌లకు చుక్కేదురే అని చెప్పాలి. ఎప్పటికంటే కాస్త త్వరగానే ఆటలు మొదలు పెట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా పెద్ద సినిమాలకు ఆరు షోల వరకు చాన్స్ ఉంటే.. యానిమల్ సినిమాకు మాత్రం ఐదు షోలు మాత్రమే వేసుకునే చాన్స్ ఉంటుంది. ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్‌లలో కూడా టైమింగ్స్ మారే చాన్స్ ఉంటుంది. అయితే ఇందులో నిజమెంతుందో తెలియాంటే మాత్రం ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
#Animal Run time confirmed. The run time of Animal will be 3 hours 21 minutes. Crazy!!!#AnimalTheFilm #RanbirKapoor #RanbirKapoor𓃵 #RashmikaMandanna #SandeepReddyVanga pic.twitter.com/xHPR4le1KG
— Aarav (@Rajvansh_Aarav) November 18, 2023
#Animal Run Time is very concerning. Who would sit for 3 hours and 21 minutes nowadays ? I hope they have made Sholay otherwise it will affect its business …#RanbirKapoor pic.twitter.com/DizjHciR2T
— Aj Sourov Gyan (@AjSourovGyan) November 18, 2023