Mahendragiri Varahi | టాలీవుడ్ హీరో సుమంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’ (Mahendragiri Varahi). మీనాక్షి కథానాయికగా నటిస్తుంది. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కాలిపు మధు, ఎం.సుబ్బారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాగర్లపూడి సంతోశ్ దర్శకుడు.

Mahendragiri Varahi | టాలీవుడ్ హీరో సుమంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’ (Mahendragiri Varahi). మీనాక్షి కథానాయికగా నటిస్తుంది. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కాలిపు మధు, ఎం.సుబ్బారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాగర్లపూడి సంతోశ్ దర్శకుడు. రాజశ్యామలా అమ్మవారి నిత్య ఉపాసకులు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్రస్వామి సమక్షంలో ఈ సినిమా టైటిల్‌ని మేకర్స్ గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి చిత్రబృందం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్‌ను గమనిస్తే.. వారాహి అమ్మవారి ఉగ్ర రూపం కనిపిస్తుండగా.. సుమంత్ కాగడ పట్టుకుని దేనికోసమో అన్వేషిస్తున్నట్లు ఉంది. ఇక ఈ సినిమా మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం నేపథ్యంలో సాగే కథని దర్శకుడు తెలిపారు. ఈ ఏడాది జూన్‌లో షూటింగ్ ప్రారంభించుకున్న ఈ చిత్రం అతి త్వరలోనే టాకీ పూర్తి చేసుకోనుందని, త్వరలోనే నిర్మాణం పూర్తవుతుందని చిత్రయూనిట్ ప్రకటించింది.
Here the title and first look of film#MahendragiriVarahi @iSumanth@Minakshigoswamy @vennelakishore@kalipumadhu5 #MSubbaReddy @anuprubens@Santhosshjagar1 @inagavijaykumar
Shoot in progress🎬
Coming soon to theatres. pic.twitter.com/bn825da9DE— Vamsi Kaka (@vamsikaka) November 17, 2023