NBK 109 Movie | 2023లో వరుసగా వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ. ఇక ఈ సినిమాలు ఇచ్చిన జోష్‌తో మరో బ్లక్ బస్టర్ కాంబోను లైన్‌లో పెట్టాడు. బాలకృష్ణ తాజాగా నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ NBK 109.

NBK 109 Movie | 2023లో వరుసగా వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ. ఇక ఈ సినిమాలు ఇచ్చిన జోష్‌తో మరో బ్లక్ బస్టర్ కాంబోను లైన్‌లో పెట్టాడు. బాలకృష్ణ తాజాగా నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ NBK 109. వాల్తేరు వీరయ్యతో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ న్యూస్ బయటకు వచ్చింది.
ఈ సినిమాలో ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. అయితే నట సింహం బాలకృష్ణతో దుల్కర్ సల్మాన్ కలిసి వెండితెరపై కనిపిస్తే ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న బాబీ.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌లో బాలకృష్ణను ఎలా చూపించబోతున్నాడోనని బాలయ్య అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు.
ఇక NBK 109 సంబంధించి ఇప్పటికే ప్రీ లుక్ పోస్టర్‌ను విడుదల చేయగా.. ఈ పోస్టర్‌లో గొడ్డలికు ఓ కళ్లజోడును జోడించి.. అందులో ఎగిరిపడుతున్న విలన్లు చూపించారు మేకర్స్. ఇక అదే గొడ్డలికి ఓ లాకెట్‌ను కూడా ఉంది. అంతేకాకుండా బ్లడ్ బాత్ కా బ్రాండ్ నేమ్, వయోలెన్స్ కా విజిటింగ్ కార్డ్ అంటూ వీర లెవల్ ఎలివేషన్‌తో ఆ పోస్టర్‌కు బాబీ క్యాప్షన్ జోడించారు. చూస్తుంటే ఈ సారి మరింత పవర్‌ఫుల్ రోల్‌లో బాలయ్య ఉండబోతున్నట్లు తెలుస్తుంది.