Pindam Movie | ఒకరికి ఒకరు (Okariki Okaru) సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రముఖ నటుడు శ్రీరామ్ (Sriram). ఇక అయన చాలా రోజుల గ్యాప్ తరువాత నటిస్తున్న తాజా చిత్రం ‘పిండం’(Pindam). కుశీ రవి (Kushi Ravi) హీరోయిన్‌గా నటిస్తుండగా.. సాయికిరణ్ దైదా (Sai Kiran Daida) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

Pindam Movie | ఒకరికి ఒకరు (Okariki Okaru) సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రముఖ నటుడు శ్రీరామ్ (Sriram). ఇక అయన చాలా రోజుల గ్యాప్ తరువాత నటిస్తున్న తాజా చిత్రం ‘పిండం’(Pindam). కుశీ రవి (Kushi Ravi) హీరోయిన్‌గా నటిస్తుండగా.. సాయికిరణ్ దైదా (Sai Kiran Daida) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక సాయికిరణ్‌కు ఇదే మొదటి మూవీ. ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ డేట్ అప్‌డేట్ ఇచ్చారు.
ఈ సినిమాను డిసెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం సోషల్ మీడియాలో ప్రకటించింది. కళాహి మీడియా పతాకం (Kalahi Media Banner)పై యశ్వంత్ దగ్గుమాటి (Yashwanth Daggumaati) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రోడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. శ్రీరామ్‌తో పాటు, ఈశ్వరీరావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ, మాణిక్ రెడ్డి, బేబీ చైత్ర, బేబీ ఈషా, విజయలక్ష్మి, శ్రీలత తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.
DECEMBER 15th 2023
Mark your calendar in RED 📝Coz #Pindam – The Scariest Film Ever is all set for its grand theatrical release on December 15th❤️🔥@saikirandaida @Yeshwan71014110 @eswari_rao1225#kalaahimedia #thescariestfilmever pic.twitter.com/U9vJC9JZKW
— Vamsi Kaka (@vamsikaka) November 18, 2023
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఓ మారుమూల పల్లెటురిలో ఇల్లు, అందులో ఓ కుటుంబం, వాళ్లను భయపెట్టే ఆత్మ.. దీని చుట్టే కథ స్టోరీ ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ఆత్మలను బంధించే మంత్రగత్తె పాత్రలో ఈశ్వరి రావు నటిస్తుండగా.. తన కుటుంబాన్ని ఆత్మ నుంచి రక్షించుకునే పాత్రలో శ్రీరామ్ కనిపించనున్నాడు. ఇక 1930 నుంచి 1990 వరకు మూడు టైమ్‌లైన్‌లలో ఈ సినిమా ఉండబోతున్నట్లు దర్శకుడు సాయికిరణ్ దైదా తెలిపాడు.