Sapta sagaralu Daati (Side B) | కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి (Rakshit shetty), రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) ప్రధాన పాత్రల్లో వచ్చిన ప్రేమ కథా చిత్రం ‘సప్తసాగరాలు దాటి సైడ్ – బీ’ (Sapta Sagaralu Dhaati Side-B). ఈ సినిమాకు హేమంత్ రావు దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో వచ్చి కన్నడలో బ్లాక్‌బస్టర్ అయిన ‘సప్తసాగరాలు దాటి సైడ్-ఎ’ కు సీక్వెల్‌గా ఈ సినిమా వచ్చింది.

Anand Devarakonda | కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి (Rakshit shetty), రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) ప్రధాన పాత్రల్లో వచ్చిన ప్రేమ కథా చిత్రం ‘సప్తసాగరాలు దాటి సైడ్ – బీ’ (Sapta Sagaralu Dhaati Side-B). ఈ సినిమాకు హేమంత్ రావు దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో వచ్చి కన్నడలో బ్లాక్‌బస్టర్ అయిన ‘సప్తసాగరాలు దాటి సైడ్-ఎ’ కు సీక్వెల్‌గా ఈ సినిమా వచ్చింది. ఇక సైడ్ – బీ శుక్రవారం విడుదల కాగా ఈ సినిమా చూసిన ప్రేక్షకులు మంచి ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీని చూశామంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే తాజాగా ఈ సినిమా చూసిన టాలీవుడ్ కుర్ర హీరో ఆనంద్ దేవరకొండ మూవీతో పాటు దర్శకుడిపై ప్రశంసల వర్షం కురిపించాడు.
”ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు చూసి హృదయం బరువెక్కింది. మరికొన్ని సన్నివేశాలు నన్ను భావోద్వేగానికి గురి చేశాయి. ఇక సైడ్ – బీ చూస్తున్నంతసేపు మీరు మరో ప్రపంచంలోకి వెళతారు. ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు ఓ అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. క్లాసిక్ ఫిల్మ్. ఎక్స్‌ట్రార్డినరీ ఫిల్మ్ మేకింగ్. అండ్ రెండు సినిమాలలో మ్యూజిక్ అద్భుతంగా ఉందంటూ” ఆనంద్ దేవరకొండ ట్విట్టర్‌లో రాసుకోచ్చాడు. కాగా ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
So many scenes are heartbreaking, some others emotionally disturbing. For the duration of the film, you travel to another world – every scene evokes a certain feeling within the audience. Classic film. Extraordinary film making.
Ps: music in both the parts is just outstanding!…
— Anand Deverakonda (@ananddeverkonda) November 17, 2023
సప్త సాగరాలు దాటి సైడ్-ఏ కథ విషయానికొస్తే.. మను (రక్షిత్ శెట్టి), ప్రియ (రుక్మిణి) అనే మధ్య తరగతికి చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటుంటారు. పెళ్లిచేసుకుని జీవితంలో చాలా సాధించాలని, గొప్పగా ఎదగాలని కలలు కంటుంటారు. మరీ ముఖ్యంగా సముద్రం పక్కన ఓ అందమైన ఇల్లు కట్టుకుని కుంటుంబంతో కలిసి హ్యాపీగా జీవించాలని అనుకుంటారు. అయితే ఓ రాంగ్ డిసీషన్ వల్ల వీళ్ల జీవితాలు తలకిందులైపోతాయి. రక్షిత్ శెట్టి జైలుకు అంకితమైపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? రక్షిత్ శెట్టి జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? చివరకి జైలు నుంచి రక్షిత్ బయటకు వచ్చాడా? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.