వందశాతం పక్కా.. ఈ సారి ప్రపంచకప్‌ మనదే : రజినీకాంత్‌-Namasthe Telangana

[ad_1]

Rajinikanth | వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌పై తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ (Rajinikanth) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం అహ్మదాబాద్‌ ( Ahmedabad)లోని వేదికగా భారత్‌ – ఆస్ట్రేలియా (India Vs Australia) మధ్య జరిగే ఫైనల్స్‌ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా వంద శాతం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.


Rajinikanth | వందశాతం పక్కా.. ఈ సారి ప్రపంచకప్‌ మనదే : రజినీకాంత్‌

Rajinikanth | ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ (ICC World Cup Final)కు చేరింది. ఆదివారం (నవంబర్‌ 19) అహ్మదాబాద్‌ ( Ahmedabad)లోని నరేంద్ర మోదీ స్టేడియంలో (Narendra Modi Stadium) భారత్‌ – ఆస్ట్రేలియా (India Vs Australia) మధ్య ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఫైనల్స్‌ కావడంతో క్రికెట్‌ అభిమానులే కాదు.. అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఈ మ్యాచ్‌కు స్వయంగా హాజరై వీక్షించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఫైనల్స్‌పై తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ (Rajinikanth) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ వంత శాతం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు (100 per cent sure India will win).

బుధవారం భారత్‌ – న్యూజిలాండ్‌ మధ్య జరిగిన సెమీఫైన్సల్‌ మ్యాచ్‌ను రజినీకాంత్‌ వాంఖడే స్టేడియంలో స్వయంగా కుటుంబ సమేతంగా వీక్షించిన విషయం తెలిసిందే. అనంతరం చెన్నై చేరుకున్న సూపర్‌ స్టార్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఫైనల్స్‌లో భారత్‌ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ‘న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్స్‌ మ్యాచ్‌లో మొదట కాసేపు టెన్షన్‌ పడ్డాం. మొదటి గంటన్నర చాలా ఆందోళనకు గురయ్యాం. ఆ తర్వాత వరుసగా వికెట్లు పడిపోవడంతో గేమ్‌ మనకు అనుకూలంగా మారింది. ఈ సారి ప్రపంచకప్‌ మనదే. ఫైనల్స్‌లో వంద శాతం ఖచ్చితంగా భారత్‌ గెలుస్తుంది’ అని ధీమాగా చెప్పారు.

Also Read..

World Cup Final | వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు మోదీ, ధోనీ.. స్పెషల్‌ అట్రాక్షన్‌గా వాయుసేన విన్యాసాలు

MS Dhoni | పెద్దల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్న ధోనీ దంపతులు.. వీడియో

David Beckham | డేవిడ్ బెక్‌హ‌మ్‌కు అంబానీ కుటుంబం ప్రత్యేక ఆతిథ్యం.. పిక్‌ వైరల్‌

Next article[ad_2]

Leave a Comment